YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పులివెందుల లో సునీత ప్రచారం

పులివెందుల లో సునీత ప్రచారం

పులివెందుల
కడప జిల్లా  పులివెందుల లో వైఎస్ వివేకానంద కూతురు వైయస్ సునీత డోర్ క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిల కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి కి అన్యాయం జరిగిందని అతి దారుణంగా వివేకానంద రెడ్డి ని గొడ్డలి తో  కొట్టి నరికి నరికి చంపారని... ఐదు సంవత్సరాలు గడుస్తున్నా  ఇంకా న్యాయం జరగలేదని వైయస్ వివేకకు న్యాయం చేయాలంటే మే 13 వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని కోరారు. న్యాయం ప్రజలందరికీ తెలుసని షర్మిలకు కచ్చితంగా ఓటు వేస్తారని నమ్మకం ఉందని అన్నారు. ప్రజలలో తిరుగుతుంటే నాకు వారికి  కండ్ల కు నీళ్లు వస్తున్నాయని  కానీ అది చెప్పుకునే ధైర్యం లేదని 40 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉందని  ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుందని అన్నారు.

Related Posts