YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో నాలుగు జిల్లాలో ‘నవోదయం’ గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టుకు 10 చెక్ పోస్ట్ లు : మంత్రి జవహర్

మరో నాలుగు జిల్లాలో ‘నవోదయం’     గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టుకు 10 చెక్ పోస్ట్ లు : మంత్రి జవహర్
సారా రహిత గ్రామాల కోసం చేపట్టిన నవోదయ కార్యక్రమం 9 జిల్లాలో విజయవంతమైందని, ఇప్పుడు మరో 4 జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ తెలిపారు. రాష్ట్రం సారా రహితంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సారా ఆధారిత వృత్తిగా చేసుకున్న కుటుంబాలను గుర్తించి  వాటిని నుంచి దూరం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు.  దీంతో పాటు సారా తాగడం కలిగే నష్టాలపై చైతన్యం తీసుకొస్తున్నామన్నారు., సారా రవాణా చేసే వారిపైనా, తాగేవారిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. విశాఖ జిల్లా కళ్యాణలోవ వద్ద 38,875 కిలోల గంజాయిని ధ్వంసం చేశామన్నారు. ఈ గంజాయి 14 పోలీస్ స్టేషన్ ల ద్వారా పట్టుకున్నదన్నారు. గంజాయి రవాణ లో గిరిజన యువత ఎక్కువగా ఉంటోందన్నారు. గంజాయి రవాణా చేసినా, సాగుచేసినా జైల్ కు పంపిస్తున్నామన్నారు. శిక్ష కాలం పూర్తి అయిన తరవాత వారికి వివిధ వృత్తులలో నైపుణ్యం ఇచ్చి,  ప్రత్నామాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. పట్టుబడినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలుంటే, ఆయా కార్పొరేషన్ల  ద్వారా వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. గంజాయి వల్ల నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించి, చైతన్యంతీసుకొస్తున్నామన్నారు. గత ఏడాది కోటీ 69 లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు దశల్లో ఉన్నమొక్కలను, విత్తనాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  విజయనగరం, విశాఖపట్నం ,తూర్పు గోదావరి జిల్లాలో 10 ఎక్సైజ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జవహర్ తెలిపారు. దీని ద్వారా గంజాయి రవాణా ను అరికడతామన్నారు. బెల్ట్ షాపులకు సంబంధించి నేటివరకూ రాష్ర్ట వ్యాప్తంగా 7,321 కేసులు నమోదు చేశామని, 7,526 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.  గంజాయి వ్యాపారం చేసే వారిపై పీడీ  యాక్టు పెడతామన్నారు. ఇప్పటికే నలుగురిపై పీడీయాక్డు నమోదు చేశామన్నారు. గంజాయి, సారా, బెల్ట్ షాపుల రహిత రాష్ట్రాన్ని నెలకొల్పుతామన్నారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడడం లేదని మంత్రి జవహర్ స్పష్టంచేశారు. 

Related Posts