భద్రాచలం
రక్షించాల్సిన కాకిలే భక్షకులుగా మారి పేదవాడి మీద జూలు ప్రదర్శిస్తుంటే ఎలా, తాజాగా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది.
ఈనెల 13వ తారీఖున తేజా అనే వ్యక్తిని ఆటోని దొంగతనం కేసులో పట్టుకున్న బ్లూ కోర్టు సిబ్బంది వారిని స్టేషన్ కి తరలించారు .వారితో 30 వేల రూపాయలు కావాలని ఎస్సై శ్రీనివాస్ కానిస్టేబుల్స్ శంకర్ డిమాండ్ చేశారు ఈ క్రమంలో నవీన్ అనే వ్యక్తి పోలీసులకు మధ్యవర్తిత్వం చేసి పోలీసులతో సాయి తేజ అనే వ్యక్తిని బెదిరింపులకు గురి చేశాడు, బెదిరింపులకు గురి అయిన బాధితుడు ఖమ్మంలో ఉన్న ఏసీబీ అధికారులు సంప్రదించగా ఈరోజు వలపన్ని ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ శంకరును, మధ్యవర్తిగా వ్యవహరించిన నవీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఖమ్మం తరలించారు.