బద్వేలు
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమిది కేవలం షో గా మాత్రం మిగిలింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేయడం తప్ప ప్రజల్లో కూటమి అభ్యర్థి పట్ల నమ్మకం కల్పిస్తామని మూడు పార్టీల నాయకులు ఏమాత్రం చేయడం లేదు. ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు చెబుతున్నారు. బద్వేల్ అసెంబ్లీ స్థానంలో కూటమి తరపున బిజెపి అభ్యర్థిగా బొజ్జ రోశయ్య పోటీ చేస్తున్నారు. ఈయన నెలరోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బద్వేల్ అసెంబ్లీకి ఉన్నారు. పొత్తుల్లో భాగంగా బద్వేల్ అసెంబ్లీ స్థానం బిజెపికి కేటాయించారు. బిజెపికి బద్వేల్ అసెంబ్లీ స్థానం కేటాయించక ముందు వరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎంతో బలంగా ఉంది. ఒక్కసారిగా బద్వేల్ అసెంబ్లీ స్థానం బిజెపి కేటాయించడం టిడిపి ఇన్చార్జిగా ఉన్న బొజ్జ రోశయ్య తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపిలో చేరడం ఆయన పార్టీలో చేరిన కేవలం రెండు రోజుల్లోనే బద్వేలు అసెంబ్లీ బిజెపి అభ్యర్థిగా ప్రకటించడం చక చక జరిగిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా మారలేక పోయారు. ఇప్పటికీ మెజార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి వైపు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారాల్లో పాల్గొంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఏమాత్రం బయటికి చెప్పడం లేదు. బద్వేల్ అసెంబ్లీ రిజర్వు అయిన తర్వాత ఇప్పుడు జరిగే ఎన్నిక ఐదవది. గత నాలుగు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. ఐదోసారి జరిగే ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని పార్టీ ముఖ్య నాయకులు ఎన్నో సందర్భాల్లో పలు సమావేశాల్లో గంటాపరంగా చెబుతూ వచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది.
బద్వేల్ అసెంబ్లీలో నాలుగు సార్లు గెలవని తెలుగుదేశం పార్టీ ఐదోసారి గెలుస్తుంది అనే నమ్మకం లేని పార్టీ అధిష్టానం ఈ స్థానాన్ని బిజెపికి ఇచ్చి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బద్వేల్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థిగా ఉన్న బొజ్జ రోశయ్య సౌమ్యుడు అని చెప్పాలి. కానీ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఆయనకంటూ సొంత బలం లేదు. అలాగే బిజెపి కూడా బలం లేదు ఏ ఏ మండలాల్లో బిజెపికి ఎంతమంది నాయకులు ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు అనే విషయాన్ని వేళ్ళ మీద లెక్కపట్టవచ్చు. బిజెపికి మద్దతిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలకు బలం ఉందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి టిక్కెట్ వస్తుందని ముందుగానే అనుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బద్వేలు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని ఈసారి ఎలాగైనా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో ఆమె కుమారుడు పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో దాదాపు 310 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని పొందారు. నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా పాదయాత్ర చేయలేదు. రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్రకు నియోజవర్గ ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. జరగబోయే ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తుందని రాజకీయాలకు అతీతంగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఎప్పుడైతే బద్వేల్ అసెంబ్లీ స్థానం పొత్తుల్లో భాగంగా బిజెపికి ఇవ్వడం జరిగిందో అప్పుడే ప్రత్యర్థి పార్టీకి పగ్గాలు ఇచ్చినట్లు అయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అభ్యర్థి బొజ్జ రోశయ్య విజయం కోసం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి కమలం గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మూడు పార్టీల నాయకులు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఉండి ఉంటే ఆ కథ వేరుగా ఉండేదని మెజార్టీ ఓటర్లు బహిరంగంగా చెబుతున్నారు. ఆ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రచారం కూడా చేయవలసిన అవసరం ఉండేది కాదని వారు అంటున్నారు. ప్రధానంగా మూడు సామాజిక వర్గాలకు చెందినవారు కమలం గుర్తుకు ఓట్లు వేసే ప్రసక్తి ఉండదని చెబుతున్నా.రు అభ్యర్థి ఎవరో మాకు తెలియదు మేము ఎప్పుడు కూడా చూడలేదు మా తెలిసింది సైకిల్ గుర్తు ఒకటే ఇప్పుడు అసెంబ్లీ బ్యాలెట్ మిషన్ లో సైకిల్ గుర్తు ఉండదు అలాంటప్పుడు ఏదో ఒక గుర్తుకు ఓట్లు వేస్తే ఏమవుతుంది కాగా బద్వేల్ అసెంబ్లీలో కూటమి అభ్యర్థి విజయంపై రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు ఇప్పటినుంచి పెదవి విరుస్తున్నారు
బద్వేలు అసెంబ్లీలో కూటమి అభ్యర్థి విజయం పగటి కలగా మారిందని చెప్పాలి. ఇప్పటికే నాలుగు సార్లు ఓటమి పాలైన తెలుగుదేశం జరగబోయే ఎన్నికల్లో కుటుంబ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పుకుంటున్నారు పార్టీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పు ఉంటుంది బద్వేలు అసెంబ్లీ లో గెలవబోతున్నామని ప్రతి సమావేశంలో నాయకులు చెబుతున్నారు. కానీ
రాజకీయ విశ్లేషకులు పరిశీలకు మాట మరో విధంగా ఉంది ఈ విషయాన్ని పార్టీ నాయకులు జీవించుకోలేకపోవచ్చు కానీ వాస్తవం ఇదేఏడాది మార్చి ఏడవ తేదీ నాటికి వచ్చిన ప్రముఖ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి కేవలం 31 శాతం ప్రత్యర్థి పార్టీ వైకాపాకు 57 శాతం ప్రజా ఆదరణ ఉందని స్పష్టంగా చెప్పకనే చెప్పింది ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలోకి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వలసలు వెల్లువెత్తుతున్నాయి ఇది ఎవరు కూడా కాదనలేని బహిరంగ నిజం కానీ వీరిలో 70 శాతం మంది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే వారి రాజకీయ భవిష్యత్తును ఆలోచించుకొని ముందుగా పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. ఇది కూడా నగ్నసత్యం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కాయంగా కనిపిస్తుందని బద్వేల్ లో ఏమాత్రం నమ్మకము లేదని కొందరు నిర్భయంగా చెబుతున్నారు ముందుగా పసుపు కండువా కప్పుకుంటే వైయస్సార్సీపీలో ఉన్నప్పుడు తాము చేసిన దౌర్జన్యాలు భూముల కబ్జాలు బయటికి రాకుండా ఉంటాయని వారు ధైర్యంగా చెబుతున్నారు యువనేత సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఆ పార్టీకి కలిసి వస్తుందా అని ఆ పార్టీ పరిశీలకులు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల్లోను ఓటమి పాలవుతుంది పార్టీ ఓటమికి కారకులు ఎవరో అందరికీ బాగా తెలుసు పార్టీలోని కొన్ని చీడ పురుగులు కోటరీ ఇందుకు ప్రధాన కారణం ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డి ఇప్పటికీ గుర్తించలేకపోవడం విచార కారం. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి బద్వేలు అసెంబ్లీలోని ఏడు మండలాల్లో దాదాపు 310 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రాబోయే ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో ఇప్పుడు బిజెపి జెండా ఎగుర వేయవలసి ఉంది. ఒక్కసారి గతం పరిశీలిస్తే బద్వేల్ అసెంబ్లీలో కూటమి జెండా ఎగర పోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావలసిన అవసరం లేదని తాము మరో దారి చూసుకుంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బద్వేల్ లో జరిగిన పాదయాత్రలో ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా చెప్పడం జరిగింది. నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సర్వ శక్తులు ఒద్దుతుంది, అందులో భాగమే రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర. బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీది బలమా? వాప? అనే విషయం ఇప్పటికీ ఆ పార్టీ పరిశీలకులకు రాజకీయ విశ్లేషకులకు అర్థం కావడం లేదు పార్టీకి ప్రజా బలము ఉంటే పాదయాత్రలు ఎందుకని సూటిగా ప్రశ్ని స్తున్నారు.
పెయిడ్ నాయకులు కార్యకర్తలు కారణంగానే రితేష్ పాదయాత్ర విజయవంతమైందని చెప్పుకుంటున్నారని వైకాపా నాయకులు ఇప్పటికీ ఆరోపణ చేస్తున్నారు ఇందులో నిజం కూడా లేకపోలేదు గత రెండు వారాలుగా బద్వేల్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ కొంత స్పీడ్ గానే ఉంది కానీ పార్టీ అభ్యర్థి విజయం డౌట్
అని రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు 2019 ఎన్నికలోను ఇలాగే డాంబికాలు పలికి బొక్క బోర్ల పడ్డారని వారు అంటున్నారు బద్వేల్ అసెంబ్లీలో జరిగే ఎన్నికల్లో కూటమి విజయం జీవన్మరణ సమస్యగా మారింది మూడు పార్టీలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ప్రజలను ఆకట్టుకోలేక పోతున్నాయి ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు బహిరంగంగానే చెబుతున్నారు