YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాటల తూటాలు పెంచిన జనసేనాని

 మాటల తూటాలు పెంచిన జనసేనాని
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో దూకుడు పెంచారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మే 20 న ఉత్తరాంధ్రలో చేపట్టిన పోరాట యాత్ర.. ప్రస్తుతం విజయనగరానికి చేరుకుంది. గురువారం నాడు కురుపాంలో జరిగిన నిరసన కవాతులో ప్రభుత్వంతో విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు ముందే మేల్కొని ఉంటే.. ఎప్పుడో హోదా వ చ్చేది .. ఆయన వ్యక్తిగత లాభం కోసం హోదాని పక్కనపెట్టి.. బీజేపీ నాయకులకు అమరావతిలో సన్మానాలు చేశారు. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు దీక్షలు చేస్తున్నారు. ఒప్పందాలు చేసుకునేదీ మీరే దీక్షలు చేసేదీ మీరే.. ఎన్నాళ్లీ ఈ మోసం. ప్రజలు గమనిస్తున్నారు బాబుగారూ.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి ఖాయం అంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు పవన్ కళ్యాణ్. కురుపాం గిరిజన గ్రామాల్లో వైద్య సౌకర్యం లేదు. ఇక్కడ నుండి 70 కి.మి వెళితేనే కాని వైద్య సౌకర్యాలు లేకపోవడం దారుణం. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్‌గా గిరిజన ప్రజలు గుర్తుకు వస్తారు కాని.. వాళ్ల సమస్యలు మాత్రం పట్టవు. చంద్రబాబుని అడుగుతున్నా.. లక్షల కోట్లు అమరావతిలో పెడుతున్నారు. ఇక్కడ రూ. 10 కోట్లతో బ్రిడ్జి నిర్మించలేకపోతున్నారు. కురుపాం వాళ్లకి ఎంత మందికి తెలుసు అమరావతి రాజధాని అని.. ఇక్కడ చదువుకున్న యువత ఉన్నారు కాని ఉద్యోగాలు లేవు. ఎంతోమంది వలసలు వెలిపోతున్నారు. ఉత్తరాంధ్రను కావాలనే నిర్లక్ష్యం చేశారు. మీరు పదే పదే.. అమరావతి అంటూ అక్కడే అభివృద్ది అంటుంటే మిగతా గిరిజన ప్రాంతాల సంగతి ఏంటి? మీరు ఇదే తరహాతో ఈ ఇష్టం వచ్చినట్లు చేస్తే.. మళ్లీ కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు కోసం. ఈ ఉద్యమం చదువు కోసం, కనీస అవసరాల కోసం. సింగపూర్ కాదు ముందు వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ది చేయండి. మీ అబ్బాయి లోకేశం.. మాట్లాడితే మేమే రోడ్లు వేశాం.. మా నాన్నే రోడ్లు వేశారు అంటున్నారు. ఒక్కసారి కురపాం రండి మీరు మీ అబ్బాయి. ఇక్కడ రోడ్లు ఉన్నాయో లేదో చూడండి. విజయనగరం జిల్లాలో కనీస బస్సు కూడా తిరగలేని పరిస్థితి ఉంది. మీరు మీ అబ్బాయి తిరిగే చోట్ల రోడ్లు వేసుకోవడం కాదు. ప్రజల సొమ్ముతో ప్రజలు ఉండే చోట రోడ్లు వేయాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదంటూ హెచ్చరించారు జనసేనాని.

Related Posts