నారాయణ్ పూర్
ఛత్తీస్ గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మవోయిస్టులు కరపత్రాలు విడుదల చేసారు. ఖోర్గావ్ గని సమీపంలో కరపత్రాలు విసిరారు. లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసారు. నాయకులకు మరణ ఆదేశాలు ఇచ్చామంటూ ప్రకటనలో పేర్కోన్నారు. నారాయణపూర్ జిల్లాలో 6గురు నాయకులపై నక్సలైట్లు మరణ ఉత్తర్వులు జారీ చేసారు. వీరిలో నలుగురు బీజేపీ,ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు వున్నారు. ఇనుము రవాణా పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. గని గ్రామ కమిటీ అధికారిని చంపేస్తానని బెదిరించారు. దాంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. క్యాపిటలిస్ట్ వడ్గావ్ మైన్స్ బేరర్ మరియు రవాణా కోసం ప్రయత్నించిన ప్రకాష్ శర్మ, సజం తివారీ, అజ్రేల్ గనుల బ్రోకర్లు గులాబ్ బఘెల్, షాను దుగ్గా, విసెల్ నాగ్, అమిల్ భద్ర వంటి సాగర్ సాహు, రతన్ దూబేలకు మరణశిక్ష విధించాలనీ ప్రజా కోర్టు ప్రకటించిది. పరిబహన్ సంఘ్ నారాయణపూర్, అంజరేల్ కమిటీ మరియు ఛోటే హోగర్ కమిటీ అధికారులకు మరణశిక్ష వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కోంది. లారీ యజమానులు, డ్రైవర్లు పనులు నిలిపివేయాలని సీపీఐ(ఎం) ఆఖరి పిలుపునిచ్చింది.