YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మోత్కుపల్లితో ముద్రగడ భేటీ

 మోత్కుపల్లితో ముద్రగడ భేటీ
టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ కలిశారు. హైదరాబాద్‌లోని నర్సింహులు నివాసంలో ఇద్దరు సమావేశమై తాజా రాజకీయాలతో పాటూ ఇటీవలి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే మోత్కుపల్లికి తన సంఘీభావాన్ని కూడా తెలియజేశారట. 35ఏళ్లు పార్టీకి సేవచేసిన మోత్కుపల్లిపై టీడీపీ వ్యవహరించిన తీరును ముద్రగడ తప్పుబట్టారు. తన అవసరాలకు వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు. ఆయనకు తన మద్దతు ఉంటుందని.. అలాగే బాబుపాలనపై, కాపు ఉద్యమంపై తమ పోరాటానికి కూడా నర్సింహులు మద్దతు కోరారట. అలాగే ఏపీకి రావాలని కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.నాలుగు రోజుల క్రితమే మోత్కుపల్లి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను చావుకు కారణమై.. పార్టీని లాక్కున్నారంటూ మండిపడ్డారు. బాబును నమ్మి మోసపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే నర్సింహుల్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి సమయంలోనే ముద్రగుడ పద్మనాభం మోత్కుపల్లిని కలవడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుకు బద్ధ శ్రతువులు కావడంతో.. ఏపీలో పోరాటం ప్రారంభించేందుకు ఏవైనా పావులు కదుపుతున్నారేమోననే సంకేతాలు వస్తున్నాయి.

Related Posts