న్యూఢిల్లీ
ఉగ్రవాదులపై పోరు కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డిజీగా ఉమ్మడి ఎపి కేడర్కు చెందిన సీని యర్ ఐపిఎస్ అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.. 1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన నళీణ్ ప్ర బాత్ మొదట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఏఎస్పీగా కొంతకాలం ఉద్యోగం చేసి అనంతరం కరీంనగర్, వరంగల్ కడప జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. క రీంనగర్ ఎసిపిగా ఆయన వున్న సమయంలోనే మావోయిస్టు అగ్ర నాయకులు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, సంతోష్ సహా పలువురి ఎన్ కౌంటర్ జరిగింది. అప్పట్లో పీ ఫుల్స్ వార్ వున్న సమయంలో నల్లా ఆదిరెడ్డి పీపుల్స్ రెబరేషన్ ఆర్మీ అనే సాయుధ బలగాన్ని స్థాపించి దానికి బాస్ గా వుండేవారు. దీంతో పాటు లోకల్ గెరిల్లా స్క్వాడ్స్ (ఎల్ఎస్కీను కూడా స్థాపించి, పోలీసులపై పోరాడినిక వాడేవాడు. నళిణ్ ప్రభాత్ కరీంనగర్ ఎస్పిగా వున్న సమయంలో నక్సలైట్లు హత్యాయత్నం చేయగా ఆయన తృటిలో తప్పించుకున్నారు. అప్పట్లో రామగుండంలో ఎపి ఎక్స్ ప్రెస్ రైలులో ఢిల్లీ వెళుతున్న నళిణ్ ప్రభాత్ ని నక్సలైట్లు టార్గెట్ చేసి, రైలు బయలుదేరే సమ యంలో కాల్పులు జరిపేందుకు పథకం రచించారర.అయితే, అనుకోకుండా. రైలు ఒక్క నిమిషం ముందుగానే బయలుదేరడంతో నక్సలైట్ల వ్యూహం ఫలించలేదు. ఆయన హయాం లోనే కరీంనగర్లో నక్సలైట్లకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. 2004లో డిఐజి కేడర్లో వుండగా. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన మొదట జాతీయ విపత్తుల విభాగం డిఐజిగా బాధ్యతలు చేబట్టారు. ఆ తరువాత సిఆర్పిఎఫ్, ఐటిబిపిలో పనిచేసి ప్రస్తుతం సీఆర్పిఎఫ్ లో అదనపు డిజి హోదాలో వున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చి అధికారిగా పేరొందిన నళీణ్ ప్రఖాత్కు పలు ఆవార్డులు, రివార్డులు దక్కాయి. కాగా ఎన్ఎస్జీ చీఫ్ గా నలిణ్ ప్రభాత్ ఆయన పదవీ విరమణ చేసే 2028 ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతారు