YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు

ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు

కాకినాడ, ఏప్రిల్ 22 
ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలు ఎదురయ్యాయి. రోడ్డు సదుపాయం సరిగా లేక అంబులెన్స్ రాలేక సన్యాసమ్మ అనే గర్భిణీ నరకయాతన అనుభవించింది. దాదాపు రెండు కిలోమీటర్లు డోలి మోత మోయాల్సి వచ్చింది. పక్కా రోడ్డు నిర్మించాలని విన్నవిస్తున్నారు స్థానిక గిరిజనులు.డుంబ్రిగుడ మండలం కొల్లాపూట్ పంచాయతీకి చెందిన బొడ్ల మామిడి గ్రామస్తురాలు సన్యాసమ్మకు డెలివరీ సమయం కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే 108కు గ్రామస్తులు ఫోన్ చేశారు. అయితే గ్రామం వరకు రోడ్డు సరిగా లేక.. అంబులెన్స్ రాలేదని డ్రైవర్ చెప్పాడు. దీంతో ఇక చేసేది లేక సన్యాసమ్మకు డోలి కట్టారు. రెండు కిలోమీటర్లు డోలిమోత మోసుకెళ్ళి గ్రామస్తులు అంబులెన్స్ ఎక్కించారు.
రోడ్డు పనులు ప్రారంభించి చాలాకాలం అవుతున్నా పూర్తి కాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేసి మున్ముందు తమకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Posts