YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎట్టకేలకు నిరుద్యోగ భృతి ఫై కీలక నిర్ణయం

ఎట్టకేలకు నిరుద్యోగ భృతి ఫై కీలక నిర్ణయం
కమిటీల మీద కమిటీలు..చర్చల మీద చర్చలు జరిపిన చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత. నిరుద్యోగ భృతి పై కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయంతో 10లక్షల మంది యువత కు నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి దక్కనుందని మంత్రి లోకేష్ తెలిపారు. దీనికి కనీస విద్యార్హత డిగ్రీ గా నిర్ణయించినట్లు తెలిపారు. హేతు బద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు.కట్టు బట్టలతో మనల్ని బయటకి గెంటేశారని అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కియా లాంటి ఆటోమొబైల్ కంపెనీలు,ఐటీ,ఎలెక్ట్రానిక్స్ కంపెనీ లు ఆంధ్రప్రదేశ్ కు  రావటంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తున్నాయని తెలిపారు.ఒక్క ఫాక్స్ కాన్ సంస్థ లోనే 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారని వెల్లడించారు. 2018-19 బడ్జెట్ లో నిరుద్యోగ భృతి అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 1000 కోట్లు కేటాయించారన్నారు. కేవలం భృతి ఇవ్వడమే కాకుండా యువతకు  నచ్చిన రంగాల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఆన్ లైన్ లో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 22-35 ఏళ్ల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దారిధ్యరేఖ కు దిగువున ఉన్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నామని..దీనికి సుమారుగా సంవత్సరానికి 1200 కోట్ల రూపాయిలు అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.టీడీపీ మేనిఫెస్టోలో మాత్రం రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి..ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలకు తగ్గించారు.

Related Posts