అళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అట్టహాసంగా తమ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానులు అశేష ప్రజావాహిని ఊరేగింపు నడుమ ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి మల్లికార్జునరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా అఖిలప్రియ నామినేషన్ సందర్భంగా వేలాదిమంది భూమా అభిమానులు కార్యకర్తలు ప్రజలు తరలి రావడంతో ఒక దశలో భూమా అఖిలప్రియ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆళ్లగడ్డ ప్రజలు తనకు దైవ సమానులని తమ కుటుంబం పట్ల ఆళ్లగడ్డ ప్రజల ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనని భూమా అఖిలప్రియ నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి భూమా జగద్విఖ్యత్ రెడ్డి, భార్గవ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.