పరవాడ
రాష్ట్రములో వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమలు చేసిన నవరత్నాలు పధకాలుతో పరవాడ మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నవరత్నాలు పధకాలు వర్తించి ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి లబ్దిపొంది ఉన్నారని మండలంలో పార్టీలతో సంబంధం లేకుండా నిస్వార్థముగా గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజా సోలభ్యం కోసం ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీరిలను నియమించి పై నుంచి ఎటువంటి సిపార్సులు లేకుండా నిజమైన పధకాల అర్హులు గుర్తించి వాళ్ళలలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహనరెడ్డికి మాత్రమే దక్కిందిని చుక్క రాము నాయుడు ప్రతికా ప్రకటనలో తెలిపారు.మళ్ళీ ఇలాంటి నిజాయితీ గల ప్రభుత్వం కావాలి అంటే వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నం రెడ్డి అదీప్ రాజ్ కి,ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి ప్రజా మద్దతు తెలిపి మళ్ళీ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త, ప్రజలు, నాయుకులు కృషి చెయ్యాలని మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు,పరవాడ మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాలు కాలంలో ప్రభుత్వ పధకాలుకు ఇంత మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు పొందడం అనేది తన రాజకీయ అనుభవంలో ఇదే మొదట సారిగా చూస్తున్నాని అన్నారు.పరవాడ గ్రామం వరకే తీసుకొంటే ప్రభుత్వం పధకాలు ద్వారా వైస్సార్ చేయూత కింద 18,750 చొప్పున ఈ 5 ఏళ్లలో 403 మంది లబ్ధిదారులు 2 కోట్ల 91 లక్షలు లబ్ది పొందారు వైస్సార్ సున్నా వడ్డీ కింద గ్రామంలో 117 డ్వాక్రా గ్రూపులకు గాను 5 ఏళ్లలో 67 లక్షలు ఇచ్చారు జగనన్న అమ్మవడి పధకం కింద గవర్నమెంట్ స్కూల్లలో చదువుతున్నా పిల్లల తల్లుల అకౌంట్లో ఈ 5 సంత్సరాల కాలంలో 15000 చొప్పున 698 మంది అర్హులు అయ్యిన వాళ్ళకి 3 కోట్ల 35లక్షలు జమ చేశారు వైస్సార్ వాహన మిత్ర కింద ఆటో ఓనర్స్ కి 10,000 చొప్పున 5 ఏళ్ళ వైస్సార్సీపీ ప్రభుత్వ పరిపాలన కాలంలో 57 మందికి 24 లక్షలు విడుదల చేసింది గ్రామంలో వైస్సార్ రైతు బోరసా పధకం కింద 13,500 చొప్పున ఈ 5 సంత్సరాల కాలంలో 702 మంది అర్హులు అయ్యిన రైతన్నలకి 4 కోట్ల 32 లక్షలు విడుదల చేసారని అలాగే జగనన్న ఇండ్ల పట్టాలు పధకం కింద ఎటువంటి రికమేండ్లు లేకుండానే 239 మందికి ఒకే సారి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 4 కోట్ల 30 లక్షలు హోసింగ్కి ఖర్చు పెట్టారని పట్టాలు పొందిన ఆ పట్టాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చారని గ్రామంలో వైస్సార్ పింఛన్ పధకం కింద 812 మందికి 3000 ప్రతి నెల పింఛన్ పొందితున్నారని వైస్సార్ రైస్ కార్డ్స్ కి 1700 మంది వరకు అర్హులు అయ్యి ఉన్నారు అని ఇలా చెప్పుకొంటే పోతే గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక పధకం కింద లబ్దిపొంది ఉన్నారని ఇవే కాకుండా గ్రామంలో గ్రామ సచివాలయలు, ప్రభుత్వ స్కూల్లు,అంగన్వాడీ స్కూల్లు,ప్రభుత్వ హాస్పిటల్లు,రైతు భోరోసా కేంద్రలు ఇలా అన్ని సెక్టర్స్లో అభివృద్ధి చేసి చూపించిన ఘనతా వైస్సార్సీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహనరెడ్డి కి మాత్రమే దక్కింది అని వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పరవాడ మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు అన్నారు.
ప్రభుత్వం పరిపాలన మీద, నాయుకులు మీద ఎవ్వరు ఎన్నీ బురదజెల్లే మాటలు మాట్లాడిన గ్రామ స్థాయిలో వైస్సార్సీపీ చాలా బలంగా ఉందని కొంతమంది నాయుకులు ఈ ఐదు సంత్సరాలు అధికారాన్ని అనుభవించి తమ స్వార్ధ రాజకీయాలు కోసం కళ్లబోళ్ళు కబుర్లు చెప్పుతూ పార్టీకి వెన్నుపోటు పొడిచి భయటకి వెళ్ళిపోయిన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని ప్రజలు అంతా తమ పార్టీ వైపు ఉన్నారని ఈ ప్రజా ప్రభుత్వంకి ప్రజలే స్టార్ క్యాంపనియర్గా ఉన్నారని వాళ్లే వైస్సార్సీపీకి బలం,బలగం అని వచ్చే ఎన్నికలలో మళ్ళీ రాష్ట్రములో వైస్సార్సీపీ ప్రభుత్వం రావడం అనకాపల్లి ఎంపీగా బూడి ముత్యాలనాయుడు, పెందుర్తిలో ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలవడం ఖాయం అని మళ్ళీ రాష్ట్రములో నవరత్నాల పధకాలు అమలు ముందుకు నడుస్తుందని వైకాపా సీనియర్ నాయకుడు పరవాడ మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు ఆశభావం వ్యక్తం చేశారు.