విజయవాడ
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో బాగంగా సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గోన్నారు. వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు. సింగపూర్ అన్నాడు చంద్రబాబు. 3డి గ్రాఫిక్స్ చూపించారు. 30 వేల ఎకరాలు తీసుకున్నారు. 2015 లో మోడీ వచ్చి భూమి పూజ చేశాడు. యమునా నది నుంచి మట్టి తెచ్చాడు. మనకు మిగిలింది చివరికి మట్టి, డిల్లీ తలదన్నే రాజధాని ఉండాలని మోడీ చెప్పాడు. బాబు సింగపూర్ లాంటి రాజధాని అన్నాడని అన్నారు.
ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నాడు. అమరావతి కాస్త చివరికి బ్రమరావతి చేశాడు. - హైదరాబాద్ నేనే కట్టా అన్నాడు. హైదరాబాద్ మించిన రాజధాని అని మళ్ళీ చెప్పాడు. బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్పా మిగిలింది ఏమి లేదు. దేశ విదేశాలు తిరిగాడు తప్పా... పెట్టుబడులు రాలే. ఉద్యోగాలు లేవు..పరిశ్రమలు లేవు. ఇక జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే వాసింగ్ టన్ dc అన్నాడు. తర్వాత ఒక్కటి కాదు మూడు అన్నాడు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి దిక్కులేదని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రాజధాని కి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే... మళ్ళీ వాళ్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు నిధులు ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళు లేరు. మోడీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదు. ఈ సారి బాబు కి ఓటు వేసినా,జగన్ కి వేసినా డ్రైనేజీ లో వేసినట్లే. మనకు రాజధాని కావాలి అంటే...కాంగ్రెస్ రావాలి. పోలవరం కట్టాలి అంటే రాజధాని రావాలని అన్నారు. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి వుంటుందని అన్నారు.