మచిలీపట్నం
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది.జిల్లాలో మొత్తం 237 నామినేషన్లు దాఖలయ్యాయి.మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 37 నామినేషన్లు దాఖలవ్వగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు పడ్డాయి.చివరి రోజైన గురువారం ఒక్క రోజే 95 నామినేషన్లు దాఖలయ్యాయి.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది.29 తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఉపసంహరణల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా అత్యల్పంగా పామర్రు నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నంకు 36, గన్నవరం 34, పెనమలూరుకు 26, పెడనకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది.