గాంధీ భవన్
ఎలక్షన్ కమిషన్ వైఖరి పై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు పై దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. ఈసీ పట్టించుకోలేదు. మోడీ వ్యాఖ్యలకు మోడీ కి నోటీసులు ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షుడికి ఈసీ నోటీసులు ఇచ్చింది. మోడీని రక్షించేందుకు ఈసీ ప్రయత్నం చేస్తోంది. విధులు సరిగా నిర్వహించలేదని అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. మోడీ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మోడీ పై చర్యలు తీసుకోకుంటే, అధికారులపై కూడా చర్యలు తీసుకోవద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందని అన్నారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా మని చెప్తున్నారు.