YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

టెట్ ప‌రీక్షా కేంద్రాల‌కు 3,83,066 అభ్య‌ర్థుల ఆప్ష‌న్ల న‌మోదు టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి జూన్ 5 మ‌ధ్యాహ్నాం 12 గం.ల నుంచి హాల్ టికెట్ల‌ డౌన్ లోడింగ్

టెట్ ప‌రీక్షా కేంద్రాల‌కు 3,83,066 అభ్య‌ర్థుల ఆప్ష‌న్ల న‌మోదు               టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి   జూన్  5 మ‌ధ్యాహ్నాం 12 గం.ల నుంచి హాల్ టికెట్ల‌ డౌన్ లోడింగ్
ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్)ల‌కు సంబంధించి  జిల్లా ప‌రీక్షా కేంద్రాల‌ ఆప్ష‌న్ల న‌మోదు ముగిసింద‌ని టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. టెట్ కు 3,97,957 అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌గా 3,83,066 మంది అభ్య‌ర్థులు సెంట‌ర్ల ఆప్ష‌న్ల‌ను పెట్టుకొన్నార‌ని శుక్‌ివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న పేర్కొన్నారు. ఆప్ష‌న్ల‌ను సూచించిన అభ్య‌ర్థుల‌కు వారు సూచించిన ప్ర‌కార‌మే సెంట‌ర్ల ఎంపిక వుంటుంద‌న్నారు.  96.258 శాతం మంది ఆప్ష‌న్లు పెట్ట‌గా 14,891 మంది అంటే 3.742 శాతం అభ్య‌ర్థులు ఆప్ష‌న్లు పెట్ట‌లేద‌ని తెలిపారు. వీరికి నోటిఫికేష‌న్ లో జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం స‌ద‌రు అభ్య‌ర్థుల‌కు ద‌గ్గ‌ర్లోని జిల్లా ప‌రీక్షా కేంద్రాల‌ను కేటాయిస్తామ‌ని, ఒక వేళ ఆ సెంట‌ర్ల‌లో ప‌రిమితికి మించితే త‌దుప‌రి జిల్లా ప‌రీక్షా కేంద్రాల‌ను కేటాయిస్తామ‌న్నారు. జూన్  5 మ‌ధ్యాహ్నాం 12 గం.ల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడింగ్ టెట్ వెబ్ సైట్ నుంచి చేసుకోవ‌చ్చ‌ని క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి టెట్ అభ్య‌ర్థుల‌కు సూచించారు. 

Related Posts