YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్....ఎన్నికల నిబంధనలకు నూరు శాతం అనుగుణంగా ఖచ్చితంగా ఉంది

ఎమ్మెల్యే కొడాలి  నాని  నామినేషన్....ఎన్నికల నిబంధనలకు నూరు శాతం అనుగుణంగా ఖచ్చితంగా ఉంది

గుడివాడ
పూర్తి ఎన్నికల సంఘం నిబంధనల  ప్రకారంగానే.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని తన నామినేషన్ ధ్రువపత్రాలను సమర్పించారని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు అన్నారు.
గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో కొడాలి నాని నామినేషన్ రాద్ధాంతం పై.... మండలి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
మండలి హనుమంతరావు మాట్లాడుతూ అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు.... టిడిపి నేతలు రాద్ధాంతం చేశారు. ఎన్నికలకు ముందే ఓటమి భయంతో.... టిడిపి వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు.కొడాలి నాని నామినేషన్ చేల్లదంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం.కనీసం ఎన్నికల నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
ఎన్నికల నిబంధనలపై అవగాహన లేనివారు.... నామినేషన్ వేసిన తర్వాత వారిలో జ్ఞానం కలిగించాలని కాండేట్ హెల్ప్ హ్యాండ్ బుక్ ఇస్తారు. కనీసం దానిలో ఉన్న నిబంధనలు పరిశీలించిన.... టిడిపి నేతలకు బుద్ధి వచ్చి ఉండేది. కనీసం అవగాహన లేని వ్యక్తులు నామినేషన్ స్కృటీనీలకు వచ్చి కామెడీ షో చేశారు.ఎన్నికల నిర్వహణలో ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నరింగ్ అధికారిదే తుది నిర్ణయం.ఆర్వో తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేయలేరు. ఎవరైనా అభ్యర్థి నామినేషన్ పై అభ్యంతరం ఉంటే.... స్కృటిని కార్యక్రమం జరుగుతున్న సమయంలో.... ఆ అభ్యర్థి నామినేషన్ పత్రం  వచ్చినప్పుడు తెలియజేయాలి. కొడాలి నాని నామినేషన్ వెరిఫికేషన్ పూర్తై.... ఆర్వో సంతకం కూడా అయిపోయిన తర్వాత.... కేవలం న్యూసెన్స్ క్రియేట్ చేయడానికే టిడిపి వాళ్లు రాద్ధాంతం చేశారు.సత్య దూరమైన అంశాలను తీసుకువచ్చి.... ఆర్డీవో కార్యాలయంలో టిడిపి వాళ్లు నాన్నా రభస చేశారు. స్కృటిని కార్యక్రమాన్ని పక్కదారి పట్టించి ఆర్వోను బెదిరిస్తూ.... లబ్ధి పొందాలనుకుని వారు చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో..... పిచ్చెక్కినట్లు రోడ్డెక్కి టిడిపి వాళ్లు నానా యాగి చేశారని ఆరోపించారు.
 ఈ మీడియా సమావేశంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దేపల్లి పురుషోత్తం, పార్టీ నాయకులు కొల్లిపర సాయి సుబ్రహ్మణ్యం, వల్లూరిపల్లి సుధాకర్ పాల్గొన్నారు.

Related Posts