చీరాల
బాపట్ల జిల్లా చీరాల లో పండ్ల దుకాణాలపై ఆహారభద్రత అధికారులు దాడులు నిర్వహించారు.అదే సమయంలో ఓ పండ్ల దుకాణం లో అరటి పండ్లు త్వరగా పండటానికి వ్యాపారులు ఇథోఫిన్ అనే రసయానాన్ని స్ప్రే చేయడాన్ని గమనించారు.అయితే పండ్లను సహజ సిద్ధంగా సాంబ్రాణి వేసి గాలి ఆడని ప్రదేశంలో నిల్వ వుంచి మాత్రమే మగ్గపెట్టాలని..ఈ విధంగా రసాయానాలతో మగ్గ పెడితే ప్రజల ఆరోగ్యానికి హానికరమని అధికారులు తెలిపారు. రసాయనాలు చల్లిన అరటి పండ్లను శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించి పరీక్షించిన అనంతరం చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రభాకర్ రావు తెలిపారు. ఏవైన పండ్ల పై ఈవిధంగా రసాయనాలు చల్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలానే రసాయనాలు చల్లిన పండ్లను సీజ్ చేస్తామని ప్రభాకర్ రావు హెచ్చరించారు.