సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) శనివారం ఉదయం 9గంటలకు ఎట్టకేలకు విడుదలైంది. మూవీ రిలీజ్ చేసినట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో వర్మ ప్రకటించాడు. కాగా శుక్రవారం నాడు హెవీ ట్రాఫిక్ కారణంగా వెబ్‌సైట్ క్రాష్ అయింది. వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేసిన చిత్రబృందం తాజాగా మళ్లీ విడుదల చేసింది. ఈ వీడియో కోసం వర్మ, అభిమానులు, యువకులు లక్షల సంఖ్యలో ఎగబడ్డారు. ఈ సినిమాను WWW.GODSEXTRUTH.ONLINEవెబ్‌సైట్‌లో చూడొచ్చు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్‌ను విడుదల చేసినట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో వర్మ ప్రకటించాడు. అనంతరం వర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ ను చూసిన అందరికి నాదోక విన్నపం. ఈ సినిమా చూసిన తరువాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దయచేసి సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి. అప్పుడైనా నేను చెప్పదల్చుకున్న విషయం ఏమిటో, సెక్స్ గురించి నిజంగా అందరూ ఎలా అనుభూతి చెందుతారనేది నన్ను వ్యతిరేకించేవారికి తెలుస్తుంది. గాడ్ సెక్స్ ట్రూత్‌ను వ్యతిరేకించేవారంతా సెక్స్ అనేది ఓ అందమైన అనుభూతిని, అందులో సిగ్గుపడటానికి ఏమి ఉండదనే విషయం అర్ధమవ్వాలి. నేను తీసిన ఫిల్మ్‌ను వ్యతి