YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు

భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు

విజయవాడ, మే  2 
ఉక్కపోత, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఏప్రిల్ నెల ప్రజల్ని అల్లాడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో AP TS ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్ల.. పాత రికార్డులు చెరిగిపోయాయి.మంగళవారం కర్నూలు జిల్లా జి.సింగవరంలో 46.4°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3°C, వైయస్సార్ జిల్లా బలపనూరులో 45.9°C, విజయనగరం జిల్లా రాజాంలో 45.3°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.8°C, అనంతపురం జిల్లా బోప్పేపల్లెలో 44.7°C, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం, ప్రకాశం దొనకొండ 44.6°C, మన్యం జిల్లా సాలూరు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 44.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.15 జిల్లాల్లో 44°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్రంలో 67 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 83 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
ఐఎండి IMD సూచనల ప్రకారం గురువారం 34 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 216 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ SDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఏప్రిల్ నెల  ఉష్ణోగ్రతల్లో ఇవే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. గత పదేళ్లలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవే. తెలంగాణలో మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్ల, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత కొనసాగింది.
☀ మే 03 శుక్రవారం
పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ మే 04 శనివారం
విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందిరం శ్రీకాకుళంలో 6 , విజయనగరంలో 16, పార్వతీపురంమన్యం 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం 15 , విజయనగరం 9, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 12, కోనసీమ 3, తూర్పుగోదావరి 15, ఏలూరు 8, కృష్ణా 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 21, బాపట్ల 6, ప్రకాశం 22, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 18, శ్రీసత్యసాయి 2, తిరుపతి 12, అనంతపురం 4, అన్నమయ్య 3, చిత్తూరు 1, వైయస్సార్ 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Related Posts