సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా దస్తర్, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగినీడు, ప్రవీణ్, సితార తదితరులు
దర్శకత్వం: సంజనారెడ్డి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
మూల కథ: మారుతి
మాటలు: వెలిగొండ శ్రీనివాస్
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: బి.రాజశేఖర్
కథ:
రాజుగాడు (రాజ్ తరుణ్) పుట్టినప్పటి నుంచే క్లిప్టోమేనియా అనే దొంగతనం చేసే వ్యాధితో బాధపడుతుంటాడు. అతని తల్లిదండ్రులు (రాజేంద్రప్రసాద్, సితార) ఎంతో మంది వైద్యులు చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. దాంతో చేసేదేమీ లేక కొడుక్కే సర్దిచెప్పుకుంటూ ఉంటారు. అనూహ్యంగా ఒకసారి అతనికి బాంబు దొరుకుతుంది. అంతలోనే అతను తన్వి (అమైరా దస్తర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు మూడు ముళ్లు వేయడానికి ఆమెతో కలిసి వాళ్ల ఊరు రామాపురం వెళ్తుంది రాజుగాడి ఫ్యామిలీ. అక్కడ ఏమైంది? ఆ గ్రామ పెద్ద సూర్యనారాయణరాజు (నాగినీడు)కి అంజిగాడు (రావు రమేశ్)కి ఉన్న సంబంధం ఏంటి? రాజుగాడి విషయంలో సూర్యనారాయణరాజు ఎలా స్పందించారు? అంజిగాడు ఎలా స్పందించారు? వంటివి ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్ పాయింట్స్
* రాజ్ తరుణ్, రాజేంద్రప్రసాద్, సితార, నాగినీడు, రావు రమేశ్, సుబ్బరాజు నటన
* గోపీసుందర్ సంగీతం
* కెమెరా
* కొన్ని లొకేషన్లు
మైనస్ పాయింట్స్
* స్లోగా సాగిన కథ, కథనం
* ఎక్కడా కొత్తదనం లేకపోవడం
రేటింగ్:2.25/5