గుడివాడ
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబుతో కలిసి వైసీపీ బీసీ నేతలను రాము టిడిపిలోకి ఆహ్వానించారు.
వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడలో అభివృద్ధి అనేది ఎక్కడ చూసినా శూన్యం, కనీసం ప్రజలకు సక్రమంగా త్రాగునీరు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం. డబ్బు సంపాదించడం కోసమే కొడాలి నాని తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని వాడుకుంటున్నాడు. అవకాశమున్న ప్రతి మార్గంలో డబ్బు దోచుకునీ, ప్రజల సమస్యలు, గుడివాడ అభివృద్ధిని గాలికి వదిలేసారు.బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా గతంలో టిడిపి పాలన సాగింది,బీసీలకు ఏటా 30 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ద్వారా, రానున్న రోజుల్లో బీసీల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగవుతాయి. జగన్ రెడ్డి పాలనలో బీసీ సోదరుల నిధులు, విధులు లాక్కున్నాడు.గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాను,20 ఏళ్లుగా కోల్పోయిన అభివృద్ధిని, రాబోవు అయిదేళ్లలో చేసి చూపిస్తాను.ప్రజలు ఏమైపోతే మాకెందుకు,డబ్బే పరమావధిగా, దోచుకోవడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుంది. ప్రభుత్వ విధానాలు దుర్మార్గంగా ఉంటే, గుడివాడ ఎమ్మెల్యే పరమ దుర్మార్గంగా తయారయ్యాడు. ప్రజలకు మంచి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వని, పనికిమాలిన వ్యక్తిని ఎన్నుకోవడంతో, గుడివాడ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గుడివాడలో విద్యావంతులు, కష్టపడే యువతకు 20 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.