విజయవాడ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వ డివిజన్ ఎన్నికల ప్రచారం లో కేశినేని శ్వేత పాల్గోన్నారు. కేశినేని శ్వేతా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్ కి నాన్ లోకల్ కి మధ్య జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళ సొంత స్వలోబలా కోసం పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కి కనీసం ఓటు హక్కు కూడా లేదు. అసలు మీకు ఇక్కడ ఇల్లు కూడా లేదు మీ బంధువులకు కూడా ఇక్కడ ఓట్లు లేవు. కనీసం మీ అదినాయకుడు అయినా చంద్రబాబు కు కూడ ఈ ప్రాంతంలో ఇల్లు లేదని అన్నార.
పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారు. ఎన్నికలో గెలిస్తే వాళ్ల ప్రలోభాలు, లాభియింగ్ కోసం పనిచేసుకుంటారు. గెలవక పోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్లి వాళ్ళ బిజినెస్ లు చూసుకుంటారు. కేశినేని నాని విజయవాడ ప్రజలకు ఒక ముద్దు బిడ్డ. ఇక్కడే పుట్టారు పుట్టిన ఊరు కోసం విజయవాడ ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కేసినేని నాని. పది సంవత్సరాలుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి చేసిన కేశినేని నాని. కేశినేని భవన్ ద్వారా విజయవాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని. నీతిగా నిజాయితీగా విజయవాడ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని అన్నారు.
8000 కోట్లతో హాస్పిటల్స్, ఫ్లైఓవర్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లు తెచ్చింది కేశినేని నాని నే. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఉంది కేశినేని నాని చొరవతో 265 గ్రామీణ ప్రాంతాలకు వాటర్ ట్యాంక్ లు అందించిన ఘనత కేశినేని నాని దే. అలాగే ఆటో నగర్ లో 60 సంవత్సరాల నుంచి ఉన్న నీటి సమస్యను కేశినేని నాని 6 లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. 60 సంవత్సరాలు వెనుక బడి ఉన్న విజయవాడ ను గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేసింది కేశినేని నాని. జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఉపాధి కల్పనా అవకాశాలు యువతకు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. కచ్చితంగా కేశినేని నాని ని ఎంపీగా ఎమ్మెల్యేగా ఆసిఫ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు.