- చట్టం తెస్తే ట్రిపుల్ తలాక్ ఆగుతుందా..?
- చట్టం ఏమైనా సమాధానం చెబుతుందా?
- హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య
సామాజిక సమస్యలకు ‘చట్టం’ ఒక్కటే పరిష్కారం కాదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్వఇంచారు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినంత మాత్రాన ట్రిపుల్ తలాక్ ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్ని చట్టాలు తెచ్చిన వరకట్న చావులు, మహిళలపై ఇతర నేరాలు ఏ మాత్రమైనా తగ్గుముఖం పట్టాయా అని ప్రశ్నించారు. ‘‘2005-2015 మధ్య కాలంలో భారత్‌లో 80 వేల మంది మహిళలు వరకట్న వేధింపులతో చనిపోయారు. వరకట్న దురాచారంతో రోజూ 22 మంది చనిపోతున్నారు. నిర్భయ ఘటన జరిగి, నిర్భయ చట్టం తెచ్చినా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి, వాటన్నింటికీ చట్టం ఏమైనా సమాధానం చెబుతుందా?’’ అని ఆయన అన్నారు.