YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎక్కడికక్కడ డబ్బుల కట్టలు

ఎక్కడికక్కడ డబ్బుల కట్టలు

హైదరాబాద్, మే 3 
పార్లమెంట్ ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే ఉంది.ఈ నేపథ్యంలోనే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే మద్యం, నగదు, ఉచితాలు, ఇతర వస్తువుల పంపిణి పై అధికారులు నిఘా పెట్టారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టి అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో నగదు,మద్యం భారీగా పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ SOT పోలీసులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించగా కారులో తరలిస్తున్న రూ 21.53 లక్షల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యానికి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. కారు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఒటీ పోలీసులు వాహనాల తనిఖీలు చేయగా.. ఓ కారులో రూ. 15.46 లక్షల విలువ చేసే మద్యాన్ని గుర్తించారు. విచారణలో ఈ మద్యానికి సంబంధించిన సరైన పత్రాలను చూపించకపోవడంతో మద్యాన్ని సీజ్ చేసి కారులో ఉన్న ఇద్దరి వ్యక్తుల పై కేసు నమోదు చేశారు.పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ నగరంలో మద్యంతో పాటు భారీగా నగదు, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 1.89 కోట్ల నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. మరో రూ. 4.32 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఎన్నికల కో అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడు లేని విధంగా ఏకంగా 26,416 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అయన వివరించారు.అక్రమ మద్యం సరఫరా కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారని అయన తెలిపారు.ఎన్నికల కోడ్వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ 21.57 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని.....రూ 13.6 కోట్ల విలువైన ఇతర వస్తువులను వివిధ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.
హైదరాబాద్  జిల్లాలో ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ 5.71 కోట్లు విలువ చేసే వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ వివరించారు. పోలీస్ అథారిటీ,ఐటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బృందాలు ఇప్పటివరకు రూ 15.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయని  వెల్లడించారు. ఉచితాల పంపిణీ పై ఇప్పటివరకు 551 ఫిర్యాదులు రాగా... వాటిని పరిష్కరించమని తెలిపారు. మొత్తం 353 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ప్రకటించారు.
ఎక్కడెక్కడ ఎంతెంతంటే....
దుండిగల్ - రూ 60.17 లక్షలు
అత్తాపూర్ - రూ 22.30 లక్షలు
శామిర్పేట్ - రూ 9.11 లక్షలు
చందనగర్ - రూ 7.38 లక్షలు
రాజేంద్ర నగర్ - రూ 5 లక్షలు
కూకట్ పల్లి - రూ 2.62 లక్షలు

Related Posts