YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఫుల్ హ్యాపీ

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఫుల్ హ్యాపీ
ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. వీరికి తోడు, మేధా పాట్కర్, ప్రపుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ తోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు "నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్" పేరిట ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ, లెటర్ రాసారు..ఈ విషయం పై క్షేత్ర స్థాయి పరిశీలనకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి వచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అమరావతి ప్రాంత రైతులు కొన్ని విషయాలు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులను త్వరితగతిన మంజూరు చేస్తే రాజధానితో పాటుగా భూములిచ్చిన తాము అభివృద్ధి పథంలో పయనిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో రాజధానిలో బాగానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాజధాని గ్రామాల్లో  9 మందితో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లో ప్రతినిధులు పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. తుళ్ళూరు సీఆర్డీఏ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధి అన్న డిజార్డ్ మాట్లాడారు.ఏదేని ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు సహాయం చేయాలంటే వివిధ అంశాలతో కూడిన పర్యటనలు తరచూ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బహుశా ఇది చివరి పర్యటన కావచ్చేమోనని తెలిపారు. మందడం గ్రామంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణ సముదాయాన్ని, రాయపూడిలో రోడ్డు నిర్మాణంలో గృహాలు కోల్పోయిన వారికి కేటాయించిన స్థలాల్లో నిర్మిస్తున్న గృహాలను, తుళ్ళూరులోని వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేంద్రాన్ని పరిశీలించారు. ఒక పక్క కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, రాష్ట్రం లోన్ కోసం వెళ్తుంటే, ఆ లోన్ కూడా రాకుండా, రాష్ట్రంలోని అదృశ్య శక్తులు, ఆ లోన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు...  

Related Posts