YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రజ్వల్ రేవణ్ణకు బిగిస్తున్న ఉచ్చు

ప్రజ్వల్ రేవణ్ణకు బిగిస్తున్న ఉచ్చు

బెంగళూరు, మే 3
కర్ణాటకలో మొదటి విడత పోలింగ్ శుక్రవారం జరిగింది. అంతకు రెండు రోజుల ముంద హసన్ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్య ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల్లో ఇది సంచలనంగా మారింది. దానిపై రాజకీయ దుమారం ప్రారంభమయ్యే లోపు పోలింగ్ ముగిసింది. దేవేగౌడ పెద్ద కుమారుడి కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ.  హెచ్‌డీ రేవణ్ణ జేడీఎస్ కీలక నేత. ఆయన మంత్రిగా కూడా చేశారు. ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ, గతంలో హసన్ నియోజకవర్గం నుంచి దేవెగౌడనే పోటీ చేసేవారు. అయితే ఆయనకు వయోభారం పెరగడంతో రాజకీయ వారసత్వాన్ని మనవడికి అప్పగించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. 2014లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన నియోజకవర్గాల్లో హహన్ ఒక్కటే గెలిచారు. ఆయన మాత్రమే జేడీఎస్ ఎంపీగా లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ మూడు సీట్లను కేటాయిస్తే అందులో ఒకటి హసన్. సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ కే సీటు కేటాయించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు వైరల్ అయిన వీడియోల్లో ప్రజ్వల్ రేవణ్య ఓ మహిళను లైంగికంగా వేధిస్తూ కనిపించారు. ఆయన వీడియోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణకు సమీప  బంధువు అయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడి వయసు ఉన్న ఆ మహిళ కు ఉద్యోగం అవసరం కావడంతో ఉద్యోగాలు ఇప్పించారు. చివరికి తన ఇంట్లోనే ఉద్యోగం ఇచ్చారు.  అవకాశం దొరికినప్పుడల్లా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.తన కుమార్తెను కూడా ఫోన్ చేసి వేధించేవారని తెలిపింది. ఆ బాధలు పడలేక తన కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసిందని.. తర్వాత తాను కూడా ప్రజ్వల్ ఇంట్లో ఉద్యోగం మానేశానని తెలిపింది. వీడియోల్లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఉన్నదని ఆయన అన్నారు. హోళెనరసిపుర పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సిట్ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించారు. ప్రజ్వల్ ఒకరిద్దర్ని కాదని చాలా మందిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటిపైనా సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తుందని  ప్రజ్వల్ రేవణ్ణ సమీప బంధువు.. జేడీఎస్ చీఫ్ కుమారస్వామి చెప్పుకొచ్చారు. మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ సైలెంట్ గా దేశం విడిచి వెళ్లిపోయారు. కేసు నమోదైన తర్వాతనే ఆయన దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపైనా రాజకీయ దుమారం రేగుతోంది. అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్ తీసుకుంటుందని  ప్రభుత్వం ప్రకటించింది. అయితే తన పేరుతో సర్క్యూలేట్ అవుతున్న వీడియోలు   నవీన్‌ గౌడ అనే వ్యక్తి మార్ఫింగ్‌ చేశారని  తన ఎన్నికల ఏజెంట్‌ ద్వారా ప్రజ్వల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ప్రధాని మోదీ ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కర్ణాటకలో మరో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ కారణంగా ఈ కేసు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందేమోనని బీజేపీ కంగారు పడుతోంది. ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసుపై రాను రాను మరింత దుమారం రేగే అవకాశం ఉంది. కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి లైంగిక వేధింపుల అంశాలు తరచూ హైలెట్ అవుతూంటాయి. గతంలో అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ కొంత మంది దొరికిపోయారు. తర్వాత రమేష్ జార్కిహోళి అనే మంత్రి కూడా ఇలాంటి వీడియోల్లో కనిపించి పదవి పోగొట్టుకున్నారు. ఇటీవల మాజీ మంత్రి యడ్యూరప్పపైనా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి.

Related Posts