YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముద్రగడ ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు

ముద్రగడ ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు

కాకినాడ, మే 4
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీలో చిచ్చురేపింది. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకించారు కూతురు క్రాంతి. కేవలం పవన్ కల్యాణ్‌ను తిట్టడానికి మా నాన్నను జగన్ పార్టీ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ గెలుపుకు తనవంతు కృషి చేస్తారని చెప్పుకొచ్చారు క్రాంతి. అసలేం జరిగిందంటే..పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి శాయిశక్తులా కృషి చేస్తున్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. అంతేకాదు పిఠాపురం వైసీపీ నియోజకవర్గం బాధ్యతలను సీఎం జగన్.. ఆయనకు అప్పగించారు. పేరుకే అభ్యర్థిగా వంగా గీత.. కానీ వ్యవహారాలను చక్కబెట్టేది ఆయనే! పగలు, రాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు ముద్రగడ. అంతేకాదు వేర్వేరు కుల సంఘాలతో భేటీ అయ్యి జగన్ సర్కార్ గురించి వివరించడం మొదలుపెట్టారు. దీంతో పిఠాపురంలో ముద్రగడ వర్సెస్ పవన్ కల్యాణ్ తరహాగా ఫైట్ మారింది. ఈ క్రమంలో పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిట్టడానికి ముద్రగడను వైసీపీ ఉపయోగించుకుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు ఆయన కూతురు క్రాంతి. పవన్‌కు మా నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైనదన్నారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదన్న ఆమె, ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు.ముద్రగడ చేసిన ఛాలెంజ్ ఆశ్చర్యం కలిగించింది అన్నారు క్రాంతి. ఇది తమ ఫ్యామిలీకే కాదని ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదని అన్నారు. "ముఖ్యంగా మా నాన్న చాలా బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు." రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చని... ఒకరి విజయం కోసం పని చేయవచ్చన్న క్రాంతి... వేరే వ్యక్తులను వారి అనుచరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇప్పుడు ముద్రగడ చేస్తున్నది అదేనంటూ ధ్వజమెత్తారు. "వంగ గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు."  పోటీ ఎప్పుడు హుందాగా ఉండాలని, కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.ఎన్నికల తర్వాత మానాన్నను వైసీపీ వదిలివేయడం ఖాయమన్నారు క్రాంతి. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తారన్నారు ముద్రగడ కూతురు క్రాంతి. మరోవైపు కూతురు క్రాంతి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ముద్రగడ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అన్నారాయన. తన కూతురుకి మ్యారేజ్ అయిపోయిందని, ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లే ముఖ్యమన్నారు. తన కూతురుతో కొందరు తిట్టించడం బాధాకరమన్నారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, కేవలం పార్టీలో సేవకుడిని మాత్రమేనని చెప్పాశారు ముద్రగడ.

Related Posts