YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది : సీఎం చంద్రబాబు

చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది : సీఎం చంద్రబాబు
4వ నవ నిర్మాణ దీక్షను జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు, పాల్గొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు,  మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శ్రీనివాస్, కొనకళ్ళ నారాయణ రావు, మేయర్ కోనేరు శ్రీధర్, జడ్పీ ఛైర్మన్ గద్దె అనూరాధ,  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,  ఎమ్మెల్యేలు గద్దె రామమోహన రావు, బోండా ఉమామహేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఎన్జీఓ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు తెలుగు జాతికి జీవనాడి. పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా 52 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు పెట్టవద్దన్నారు. ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీటరు పెట్రోల్ ధరను ఒక్క పైసా తగ్గించడం ప్రపంచలోనే ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్దా అందరినీ వేధిస్తున్నారని విమర్శించారు.  వైకాపా, బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని అయన ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు పేరుతో వైకాపా నాటకాలాడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రమణ దీక్షితులుతో టీటీడీపై ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ అమలుచేస్తున్నారని అనిపిస్తోందని...అయినా ఏపీలో తమ కుట్ర రాజకీయాలు సాగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వంద మంది ఎంపీలు మద్దతిచ్చారని, అన్నా డీఎంకే ఎంపీలను అడ్డుపెట్టుకుని కేంద్రం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో పవన్ ఏనాడైనా స్పందించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ మాట్లాడారా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని బీజేపీ అస్ధిరపర్చాలని చూస్తోందని, రాయలసీమ డిక్లరేషన్తో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు.కుట్ర రాజకీయాలపై ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

Related Posts