YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంచనపై గర్జన

వంచనపై గర్జన
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైఎస్సార్ సీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది. నెల్లూరులోని వీఆర్ కళాశాల మైదానంలో ఉదయం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ సీపీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నేతలు దీక్షలో కూర్చున్నారు.

Related Posts