న్యూ డిల్లీ మే 4
భూమిపై రోజురోజుకు అనేక మార్పులు సంభవిస్తున్నాయి. మన దేశం సమశీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. దానికి కారణం పర్యావరణ కాలుష్యం. భూమిపై వివిధ రకాల జీవులు, అవి ఏర్పరచుకునే సహజ నమూనాలు ప్రపంచ పర్యావరణంపై పని చేయడానికి సహాయపడతాయి. కలుషితమైన గాలి, నీరు, క్షీణించిన నేల, పట్టణ పెరుగుదల అన్నీ కూడా పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు, అతినీలలోహిత కిరణాలు, ఏరో సాల్స్, ఓజోన్లలో దీర్ఘకాలిక మార్పులను పర్యవేక్షించడం వలన వాతావరణ మార్పులు కనబడుతున్నాయి.
వేడి, పొడి కారణంగా సంభవించే అడవి మంటలు, సముద్రపు ఆమ్లీకరణ, వేడెక్కడం వల్ల బ్లీచ్డ్ పగడాలు, తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా, తీరప్రాంత వరదలు, ఎడారి కారణంగా వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల, అలాగే సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ లోతులలో పెరగడం, తరచుగా సముద్రపు వేడి తరంగాలు, పిహెచ్ విలువ తగ్గడం, సముద్రం వేడెక్కడం, మంచు పలకలు ధ్రువీకరణ చెందడం ఇవన్నీ కూడా పర్యావరణ మార్పుల వల్ల వస్తున్నాయి. రానున్న రోజులలో మన దేశం తీవ్రమైన వడగాడ్పులతో ఇబ్బంది పడుతుందని, వాతావరణ మార్పులపై వాతావరణ శాఖ నివేదిక గత సంవత్సరం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తాజా గా ప్రపంచ బ్యాంకు సైతం ఇదే విషయంపై అనేక ఆందోళనకర విషయాలను తెలిపింది.వేడిగాలుల వల్ల భారత దేశంలోని మండుటెండలతో జనం ఉక్కిరిబిక్కిరి
గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మే నెలలో అయితే ఎండలు తీవ్రస్థాయికి చేరి వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వడగా లులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడి డీహైడ్రేషన్‌కు లోనై నీరసంగా, బలహీనంగా కనిపిస్తున్నారు. 1981-1990 మధ్య కాలంలో 413 రోజులు, 2011- 2020 మధ్య కాలంలో 600 రోజులు తీవ్ర వడగాల్పులు వీచాయని భారత పర్యావరణ విభాగం వెల్లడించింది. ప్రజల ఆయుష్షు తగ్గి, పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తాయని తెలిపింది. గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మే నెలలో అయితే ఎండలు తీవ్రస్థాయికి చేరి వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వడగాలులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడి డీహైడ్రేషన్‌కు లోనై నీరసంగా, బలహీనంగా కనిపిస్తున్నారు. 1981-1990 మధ్య కాలంలో 413 రోజులు, 2011- 2020 మధ్య కాలంలో 600 రోజులు తీవ్ర వడగాల్పులు వీచాయని భారత పర్యావరణ విభాగం వెల్లడించింది. అనగా 1990 నుండి 2019లో భారత్‌లో వడగాల్పుల తీవ్రత 15% పెరిగినట్లు లాన్సెట్ నివేదిక తెలిపింది.ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడగాలులు వీచి వాటి ప్రభావం అనేక వాటిపై కనిపిస్తుంది. రైతులు, వివిధ కార్యాలయాల్లో సిబ్బంది పని చేయలేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల భూమిపై ఉన్న జీవులపై కూడా ప్రభావం చూపుతుంది. కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, చెరువు లో పెంచే చేపల పెంపకంలో అనుకున్న స్థాయిలో కన్నా దిగుబడి తగ్గుతుంది. ఇవేకాక పాలిచ్చే జంతువులైన ఆవులు, గేదెల్లో కూడా పాల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణ తాపం రవాణా వ్యవస్థ పై కూడా ప్రభావం చూపి, ఆహార ధాన్యాల రేట్లు పెరిగి ప్రజలకు భారమవుతుంది. ఆహార ధాన్యాల నిలువల కోసం, వాటిని శీతలీకరణ గిడ్డంగుల్లో ఉంచడానికి, వాటిని చల్లపరచడానికి ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లు అవసరమవుతాయి. తద్వారా కరెంటుబిల్లు కూడా అధికంగా వచ్చి నష్టపోయే అవకాశం వుంది. పర్యావరణంలో ఉష్ణోగ్రతల తగ్గుదల కోసం అనేక చర్యలు చేపట్టాలి. చెట్లను అధికంగా నాటడం, వాటిని రక్షించడం ద్వారా కొంతమేర ఉష్ణోగ్రతను అరికట్టవచ్చు.ఒక్కొక్క గృహానికి అనేక వాహనాలు వాడడం, ఎసి, రిఫ్రిజిరేటర్లు వాడడం వల్ల, మొబైల్‌లు వాడటం, వాటి టవర్ల నుండి వచ్చే రేడియేషన్ ద్వారా, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్ధాలను కాల్చడం ద్వారా, వాతావరణం కలుషితమై భూమి పై కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలై, ఓజోన్‌పై ప్రభావం చూపి, భూమిపై ఉష్ణోగ్రత, వడగాలులు పెరుగుతాయి. వీటిని అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందించి, క్షేత్రస్థాయిలో ప్రతిష్టంగా అమలు చేసినట్లయితే భూమిపై ఉష్ణతాపాన్ని అరికట్టవచ్చు. వేసవి కాలంలో ఉష్ణ తాపాన్ని, వడగాలు లను అధిగమించాలంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో బయటకు వెళ్లకూడదు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు పట్టుకొని మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటప్పుడే వడగాలుల నుండి మనల్ని మనం రక్షించుకోగలం. నీటిని నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు ఎక్కువగా తాగాలి. ఎండ తాకిడికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్‌ను సంప్రదించి ఆయన సలహా మేరకు పలు జాగ్రత్తలు పాటించాలి.