YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కళ్యాణదుర్గంలో హోరా హోరి...

 కళ్యాణదుర్గంలో హోరా హోరి...

అనంతపురం, మే 6
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నడుస్తోంది.  నేతలు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ముగించి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థులు మాత్రం ఇంకా స్పీడు తగ్గలేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థులే కాదు వారి కుటుంబ సభ్యులు సైతం నిద్రాహారాలు మాని తమ భవిష్యత్తును తేల్చుకునే పనిలో పడ్డారు. అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో నిలిచారు. కూటమి అభ్యర్థిగా టిడిపి నేత అమిలినేని సురేంద్రబాబు బలిలో దిగనున్నారు. ఇద్దరు నేతల శైలి చాలా భిన్నమైనది. వైసిపి అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య  ప్రభుత్వ ఉద్యోగం వదిలిరాజకీయాల్లోకి వచ్చారు. సురేంద్రబాబు క్లాస్ వన్ బిజినెస్ మాన్. ఇప్పటికే తలారి రంగయ్య తన అదృష్టాన్ని 2019లోనే నిరూపించుకున్నాడు. మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. ఆమిలినేని సురేంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని కల్యాణదుర్గం నుంచి ప్రారంభించారు. ఇరవై ఏళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న అమిలినేని సురేంద్రబాబుకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా అధినేత చంద్రబాబు నాయుడు ఆమిలినేని సురేంద్రబాబుకు అవకాశం కల్పించాడు. దీంతో అమిలినేని సురేంద్రబాబు టికెట్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి వచ్చారు. నియోజకవర్గంలోని అసమ్మతి నేతలను ఏకం చేసుకుని ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.  సురేంద్రబాబు తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నియోజకవర్గాలో మండలాల వారీగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గeన్ని దోచుకోవడమే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శిస్తూ తమ ప్రచార దూకుడుని పెంచారు. గతంలో ఇక్కడ ఓ మంత్రి ఉండేది ఆమె నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కేవలం తన ఖజానాను నింపుకొని ఇక్కడి నుంచి పారిపోయిందని విమర్శిస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఆమె ఎట్టి పరిస్థితులను గెలవదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉషశ్రీ చరణ్ ను వేరే నియోజకవర్గం కు బదిలీ చేసారని బహిరంగ సభలోను ప్రచార సభల్లోను విమర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కళ్యాణదుర్గం అంటేనే టిడిపికి బలమైన కేడర్ ఉంది. ఇక్కడ టీడీపీ  అభ్యర్థిగా ఎవరు పోటీ చేసిన కూడా క్యాడర్ మొత్తం వారికి సహకరిస్తూనే ఉంటుంది. గతంలో ఉన్న హనుమంతరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందిగా 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరి కాదని మాదినేని ఉమామహేశ్వర నాయుడుకి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే 2019 ఎన్నికల జగన్ హవాలో మదినేని ఉమా మహేశ్వర్ నాయుడు ఓటమి చవిచూశారు. అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ గెలుపొందారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేస్తున్నారు.   సురేంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. నియోజకవర్గంలో వర్గ విభేదాలతో సతమతం అవుతున్న పార్టీ శ్రేణులకు ఒక్కతాటిపైకి తీసుకువచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షిస్తూ దుర్గం రాజకీయాల్లో కొత్త ఓరవడిని సృష్టించుకుంటూ ముందుకెళ్తున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించేవారు ఒక వైపు.. పదవి ఆకాంక్షించే వారు మరో వైపు అన్న ధోరణి లో కళ్యాణదుర్గం రాజకీయా ప్రసంగాలతో ముందుకు వెళుతున్నారు. సురేంద్రబాబుకు అంగ బలం అర్థ బలం కలిసి వచ్చే అంశం. మరో వైపు కూటమి మేనిఫెస్టో కూడా పెద్ద ఎత్తున కలిసి రావడంతో గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచిన తలారి రంగయ్య ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ మండల స్థాయి నేతలతో కార్యకర్తలతో మమేకమవుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ చేసిన పనులు వ్యతిరేక విధానాలు రంగయ్య మీద పడుతుండడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేకుండా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమే నియోజకవర్గ ప్రజలకు అందించారు. గతంలోనూ ఉషశ్రీ చరణ్ కు ఎంపీకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమానేలా ఉండేది. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎంపీ తలారి రంగయ్య నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. అప్పట్లో ఇద్దరి మధ్య వర్గ విభేదాలతో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుతం ఉషశ్రీ చరణ్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నడంతో ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రంగయ్య వర్గం మాత్రం ప్రస్తుత ఎన్నికలకు సహకరిస్తుండడం ఉషశ్రీ జగన్ వర్గం పైకి సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో అది సాధ్యం కావడం లేదు అనేది బహిరంగ రహస్యం. కేవలం తలారి రంగయ్య బీసీ సామాజిక వర్గం కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో కేవలం ఆ సామాజిక వర్గాన్ని మాత్రమే నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా పెద్దగా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు కుటామి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అంగ బలం ఆర్టిక బలంతో ముందుకు వెళుతుండడంతో తలారి రంగయ్య అంత ఆర్థికంగా వెనుకబడ్డారన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.  

Related Posts