YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి అక్షర తెలంగాణ దిశగా వడివడిగా...విద్యారంగం

బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి అక్షర తెలంగాణ దిశగా వడివడిగా...విద్యారంగం
తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ అర్భన్ జిల్లాలో శనివారం  ఉదయం అమరవీరుల స్థూపం వద్ద  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం  పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, తెలంగాణ జెండా ఎగురేసి, వందనం చేశారు. అనంతరం అవార్డు గ్రహీతలకు పురస్కారాలిచ్చి, సన్మానించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఈ నాలుగు సంవత్సరాలలో బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడేవిధంగా సిఎం కేసిఆర్   నాయకత్వంలో రూపొందించిన పథకాలు నేడు దేశ,విదేశాల ప్రశంసలు పొందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాలుగేళ్ల అనతి కాలంలోనే సిఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో అత్యంత అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, పారిశ్రామిక వంటి రంగాల్లో తెలంగాణ అనేక రికార్డులు, రివార్డులు సాధించింది. దేశంమొత్తం తెలంగాణ వైపు చూసేలా, ఇక్కడి కార్యక్రమాలను అధ్యయనం చేసే విధంగా, ఆయా రాష్ట్రాలు మన విధానాలను, పథకాలను అనుసరించేలా మనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాం. బంగారు తెలంగాణ లక్ష్యంవైపు వడివడిగా అడుగులెస్తున్నామన్నారు.వసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజును చేయాలని, అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలాలని, చేతివృత్తులు, కులవృత్తులకు జీవం పోయాలని సిఎం కేసిఆర్ చేస్తున్న కృషి నేడు సాకారమై మన కళ్లముందే సాక్షాత్కరిస్తోందన్నారు.వచ్చిన తెలంగాణ నలుగురి ముందు నవ్వుల పాలు కాకూడదని, తలఎత్తుకుని నిలబడేలా ఉండాలని సిఎం కేసిఆర్ ఈ నాలుగేళ్లుగా చేసిన శ్రమ ఫలితమే నేడు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సగర్వంగా, సంతోషంగా మనమంతా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని అన్నారు.
పండగలా వ్యవసాయం...సంతోషంలో రైతన్నలు
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, రైతే వెన్నుముక అన్న దానిని అక్షరాల నమ్మి అమలు చేస్తున్న ఏకైక సిఎం మన కేసిఆర్ గారు. గ్రామాలు స్వయం సమృద్ధితో వికసించాలని, వ్యవసాయం పండగగా మారాలని, రైతును రాజు చేయాలని ఆయన చేస్తున్న కృషి నేడు రైతు ముఖాల్లో సంతోషాన్ని నింపుతోంది. వ్యవసాయానికి వైభవాన్ని తీసుకొస్తోంది. వ్యవసాయం దండగ అన్న పరిస్థితిని పూర్తిగా మార్చి వ్యవసాయం పండగలా చేసే ప్రయత్నం నిర్విరామంగా, నిర్విగ్నంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను 17వేల కోట్ల రూపాయలు నాలుగుదశల్లో మాఫీ చేసి 35 లక్షల మంది రైతులను రుణవిముక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడే పరిస్థితిని పూర్తిగా మార్చేసి నేడు ఎప్పుడు వెళ్లినా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా స్టాక్ చేశారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు ఏ ఒక్క గ్రామంలోగానీ, మండలంలోగానీ ఎరువులు, విత్తనాలకు లైన్లో నిలబడ్డ వార్త కూడా వినకుండా చేశారు. రైతు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైంది కరెంటు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడో రాదో తెలువక, వచ్చిన కరెంటుతో మడి పారక, తెచ్చిన అప్పు  తీరక రైతు పడ్డ అవస్థలు, జరిగిన ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించిన సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆరు నెలల్లోనే 9గంటల విద్యుత్ ను ఇచ్చారు. రైతుకు షరతులతో కూడిన విద్యుత్ అవసరం లేదని భావించిన సిఎం కేసిఆర్ నేడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు కరెంటు కావాలని ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి తెలంగాణ వచ్చిన ఈ నాలుగేళ్లలో 24 గంటల కరెంటు వద్దనే వరకు వచ్చామంటే...మనం సాధించిన ప్రగతి, ఈ ప్రభుత్వ లక్ష్యం ఏమిటో కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది.పంట రుణాలు మాఫీ చేసి, విత్తనాలు-ఎరువులు అందుబాటులో పెట్టి, 24 గంటల కరెంటు ఇస్తే సరిపోదని భావించిన సిఎం కేసిఆర్  రైతు ఇక అప్పు చేయొద్దు...పంట పెట్టుబడి కోసం ఎక్కడికో పరుగులు పెట్టొద్దని రైతు బంధు పథకం తెచ్చి ఎకరానికి ఏటా 8000 రూపాయల పంట పెట్టుబడిని ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్తున్న సిఎం.. కేసిఆర్. రైతు నుంచి శిస్తు వసూలు చేయడం, దానిని ఆపడం వరకే మనం ఇప్పటి వరకు చూశాం...కానీ రైతుకు తిరిగి పెట్టుబడి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. ఏటా 12వేల కోట్ల రూపాయలు, 60 లక్షల మంది రైతులకు లబ్ది జరిగేలా ఇస్తున్న ఈ పంట పెట్టుబడి ఇప్పుడు గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రైతు మొఖంలో ఎన్నడూ చూడని ఆనందం వికసింపజేసిందని అన్నారు. 

Related Posts