నగరి
నియోజక వర్గంలో ఎవ్వరూ చెయ్యని మంచి పనులు తాను చేశానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగిరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా అన్నారు. గత 35 ఏళ్లలో నగరి నియోజక వర్గంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యలేని అనేక అభివృద్ధి పనులు తాను చేసి చూపించానని, తనకు మరో అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ లో నగిరికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజక వర్గంలోని పుత్తూరులో వన్నెకుల క్షత్రియులు మంత్రి రోజాకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న చెప్పింది చేస్తారని రోజా అన్నారు. అదే చంద్రబాబు చెప్పింది ఏదీ చెయ్యరని మంత్రి రోజా సైటర్లు వేశారు. గత ఐదు ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారు. తరువాత జగనన్న ఐదు ఏళ్లలో ఏం చేశారు అని పోల్చుకుంటే సరిపోతుందని, ఎవరు ప్రజలకు సేవ చేశారో తెలిసిపోతుందని మంత్రి రోజా ఓ లాజిక్ చెప్పారు.జగనన్న పాలనలో గొప్పగా జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే చంద్రబాబు పాలన, జగనన్న పాలనను పోల్చుకుంటే సరిపోతుందని రోజా అన్నారు. సీఎం జగన్ బీసీలను ఆయన ప్రభుత్వంలో బ్యాక్ బోన్ గా చూసుకుంటారని, అదే చంద్రబాబు బీసీలను కులంగానే మాత్రమే గుర్తిస్తారని మంత్రి రోజా ఆరోపించారు. జగనన్న బీసీలకు ఎంత న్యాయం చేశారో అని ఆలోచిస్తే అంతా మీకే తెలుస్తోందని అన్నారు. బీసీ అయిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 11 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని, భరత్ ను ఎమ్మెల్సీ చెయ్యడమే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి జగనన్న అవకాశం ఇచ్చారని, సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన గుర్తింపులో ఇది ఒక ఉదాహరణ అని మంత్రి రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరం అవుతుందని, పొరపాటున కూడా ఆ పార్టీకి ఓట్లు వెయ్యకూడదని మంత్రి రోజా అన్నారు.
నగరి నియోజక వర్గంలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తాను అనేక అభివృద్ధి పనులు చేశానని, తనకు మరో అవకాశం ఇస్తే నగిరిని ఇంకా అభివృద్ధి చేస్తానని, అందులో ఎలాంటి సందేహంలేదని మంత్రి రోజా అన్నారు. తనకు మరో చాన్స్ ఇస్తే మీ సేవకురాలిగా పని చేస్తానని, నగిరిలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే, మంత్రి ఆర్ కే రోజా ధీమా వ్యక్తం చేశారు.