అమరావతి
ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీనియార్టీ జాబితాలోని ఐ పీ ఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీశ్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.