మండపేట
గోదావరి జిల్లాల్లో కాపులు శెట్టి బలిజలు ఏకమైతే ప్రభంజనం సృష్టించవచ్చుననీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మండపేట పట్టణం రూరల్ మండలం శెట్టి బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం విజయ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మండపేట జడ్పిటిసి కుడిపూడి భవాని అధ్యక్షత వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం లో కాపులు, శెట్టి బలిజ సంఘియులు సంయుక్తంగా కలసి పనిచేసి తోట త్రిమూర్తులు విజయానికి కృషి చేయాలని బోస్ పిలుపునిచ్చారు. శెట్టి బలిజ లకు గౌరవం వచ్చిందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనేనని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శెట్టి బలిజలు గుర్తింపు రాలేదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు శెట్టి బలిజ లను నిర్లక్ష్యం చేస్తారన్నారు. గోదావరి జిల్లాల్లో రెండు ఎంపి టిక్కెట్లు, తనని రాజ్యసభకు ఎంపిక చేయడం లో జగన్ తీసుకున్న నిర్ణయం యావత్ భారత దేశంలో చర్చనీయాంశమైందన్నారు. శాశన మండలికి ఒకరు,శాశనసభకు ఐదుగురు కి టికెట్ లు ఇచ్చారన్నారు. ఎన్.డి.ఏ కూటమి కంటే ఎక్కువగా ఇచ్చారని బోస్ వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులు ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. 2019 ఎన్నికల్లో తాను మండపేట నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడ పెత్తందార్లు తనను ఓడించారన్నారు.మరోసారి ఆ తప్పు జరుగకూడదనీ పేర్కొన్నారు. రామచంద్రపురం , మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ రెండు కులాలు ఐకమత్యంగా ఉండి రెండు నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్థులను గెలిపించి శెట్టి బలిజల సత్తా చాటాలని బోస్ కోరారు.