కడప
కమలాపురం నియోజక వర్గంలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగింది. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు...అమాయకుడు కాదు..వివేకా హత్య నిందితుడు. హత్య జరిగినప్పుడు ఎంపి అయి ఉండి సాక్ష్యాధారాలు తుడిచేస్తుంటే పోలీసులకు చెప్పాల్సిన భాధ్యత లేదా ? సాక్షిలో హార్ట్ ఎటాక్ అంటూ నడిపింది జగన్ మోహన్ రెడ్డి భార్య. ఆనాడు ఆన్న కోసం 3200 KM పాదయాత్ర చేశా..ఇవ్వాళ వివేకా విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు తిరిగా. నేను చేసింది తప్పా ? కడప ప్రజలు ఆలోచన చేయాలి. న్యాయాన్ని గెలిపిస్తారా ? నేరాన్ని గెలిపిస్తారా అని ప్రశ్నించారు.
అన్ని ఆధారాలు ఉన్నా...హంతకులకు శిక్ష పడలేదు. అరెస్ట్ చేయాలని చూస్తే ఏకంగా ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు. వైసిపి మూకలను పెట్టీ అరెస్ట్ కాకుండా చూశాడు. వివేకా ను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపారు. ఇళ్లంతా రక్తం మయం. ఎముకలు,మెదడు బయటకు వచ్చేలా నరికారు. హత్య జరిగితే సాక్షి లో గుండెపోటు అని వార్తలు నడిపారు. హార్ట్ ఎటాక్ అని నడిపింది జగన్ మోహన్ రెడ్డి భార్య. సాక్షి నడిపేది జగన్ మోహన్ భార్య. ఎందుకు అలా చెప్పారు అనేది ఇవ్వాళ్టి వరకు సమాధానం చెప్పలేదు. ఇది న్యాయమా ? ధర్మమా ? ఇవ్వాళ అన్యాయం జరిగింది కాబట్టి పోటీలో నిలబడ్డా. ఆరోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశా. ఇవ్వాళ అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు తిరిగా. నేను చేసింది తప్పా...కడప ప్రజలు చెప్పాలి. వివేకా సొంత బాబాయి. కడప ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సొంత చిన్నాన్న ను చంపితే హత్య చేసిన వాళ్ళను జగన్ కాపాడుతూ వచ్చారు. మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. హంతకులను చట్టసభలో పంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయం అని ప్రజా కోర్టు లో న్యాయం కోసం పోటీ చేస్తున్నా. నాకు నిజం మీద నమ్మకం ఉంది. నాకు న్యాయం మీద నమ్మకం ఉంది. ఈ గడ్డ మీద వివేకా ఆత్మ ఘోసిస్తోంది. న్యాయం కోసం కొంగు పట్టి అడుగుతున్నాం. న్యాయాన్ని గెలిపించండి...నేరాన్ని ఓడించండని అన్నారు.