YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వర్షంలోనూ వేడుకలు

వర్షంలోనూ వేడుకలు
భారీ వర్షం కూడా ఆవిర్భావ దినోత్సవం ఆపలేకపోయింది. ఒక వైపు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, మరో వైపు మహబూబాబాద్ ను పలుకరించిన తొలకరి. భారీ వర్షంతో సైతం రెపరేపలాడిన జాతీయజెండా,ఎగురవేసిన మంత్రి చందూలాల్ పోలీసుల,ఎన్సీ సీ క్యాడేట్ల కవాతు, వెరసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాల్లో తడిసి ముద్దయ్యింది.జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య,ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్,జేసీ దామోదర్ రెడ్డి,ఎఎస్పీ గిరిధర్,ఎమ్మెల్యే శంకర్ నాయక్ డీఎస్పీ నరేష్ నాయక్ తెరాస రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులు హాజరై ప్రసంగించారు.మంత్రి చందూ లాల్ మాట్లా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తమ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యి నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వరుణ దేవుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా సహాయంగా భారీ వర్షం తో స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో జిల్లా ఉత్తమ అధికారులకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్,కలెక్టర్ శివలింగయ్య చేతులమీదుగా సర్టిఫికెట్ ప్రధానం చేశారు.పలువురు ప్రముఖులు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts