YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను కలిసిన ఎన్నికల నిఘా వేదిక

నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను కలిసిన ఎన్నికల నిఘా వేదిక

మంగళగిరి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని, తప్పులు చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించరాదని, నిబద్ధతతో, నిజాయితీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పూర్వ విజయవాడ నగర మేయర్ జంధ్యాల శంకర్ నూతనంగా నియమించబడిన డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఈనెల 7వ తేదీ న డిజిపి రాష్ట్ర కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల మచిలీపట్నం, పెనమలూరు లో దళిత కాలనీలో జరిగిన దాడులను డిజీపీ దృష్టికి తీసుకుని వచ్చి బాధ్యులు పై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 13 ఉమ్మడి జిల్లాలలో ఎన్నికల నిఘా వేదిక ఏర్పడి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులు సమన్వయకర్తలుగా ఉండి క్షేత్రస్థాయిలో ఎన్నికల అక్రమాలను నివారించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తోడ్పడుతామని, ప్రజాస్వామ్యబద్దంగా చ ట్టబద్ధంగా కృషి చేస్తామని, తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ ఎన్నికల నిఘా వేదిక www. apelectionwatch.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించిందని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ వెబ్ సై ట్ ను వినియోగించుకుని ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు కృషి చేయాలన్నారు. పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఓటర్లకు, పౌరులకు నమ్మకాన్ని, ధైర్యాన్ని ,విశ్వాసాన్ని కల్పించాలని కోరారు. ఎన్నికల విధులలో ఉన్న దాదాపు మూడు లక్షల మంది ఎన్నికల సిబ్బందికి తమ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకోవటానికి కావలసిన ఫెసిలిటేషన్ సెంటర్స్ ను బలోపేతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల అక్రమాలను నివారించడానికి ఎన్నికల నిఘా వేదిక చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేస్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ,ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల0 రెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత ఐదు సంవత్సర కాలంగా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నేతల కనుసన్నులలో పనిచేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఈ పరిస్థితి మారాలని తెలిపారు. పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల సందర్భంగా దాడులు, ఘర్షణలు జరుగకుండా చూడాలని కోరారు. డబ్బులు, మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా కుల మతాలకు అతీతంగా సమర్ధులైన,నిజాయితీపరులైన అభివృద్ధి కాముకులను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగేటట్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పూర్వ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు.

Related Posts