గుంటూరు, మే 8
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంబటి వర్సెస్ అల్లుడు రాజకీయం జరుగుతోంది. రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయనంత నీచుడు, నికృష్టుడు ఉండడని, అలాంటి వాడికి అల్లుడిని అయినందుకు సిగ్గుగా ఉందని గౌతమ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జీవితంలో మళ్లీ అలాంటి వ్యక్తిని కలవాలని అనుకోవడం లేదన్నాడు.అల్లుడి వీడియోపై స్పందించిన అంబటి దానివెనుక పవన్, చంద్రబాబు, కన్నా ల హస్తం ఉందని ఆరోపించారు. అలాగే తన కూతురు, అల్లుడి విడాకుల కేసు నడుస్తుందని, ఫ్యామిలీ విషయాలను రాజకీయాలను వాడుకునేంతలా దిగజారిపోయారని విమర్శించారుమరోసారి అల్లుడు గౌతమ్.. అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా తన మనవడు, మనవరాలిని చూడనివ్వకుండా చేశారని వాపోయారు. రెండ్రోజుల క్రితం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలు చెప్పారని, తన మామయ్య ఇంత మంచివాడా అని 2 నిమిషాలపాటు తానే నమ్మేశానన్నారు. నిజంగానే ఇసుమంత మంచితనం ఉంటే బాగుండేదన్నారునాలుగేళ్లుగా తన మనవడు, మనవరాలు తనవద్దే ఉన్నారని, వారిని ఆర్థికంగా తానే చూసుకుంటానని చెప్పారన్నారు. అల్లుడిగా తాను ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు కాబట్టి దుర్మార్గుడిని తానే అవుతానని చెప్పారన్నారు. తనవెనుక మోదీ, పవన్, చంద్రబాబు ఉండి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారని తెలిపారు. అయితే తాను చెప్పింది ఎంత నిజమో తెలియాలంటే ఒక వీడియో చూడాలని చెబుతూ.. 2023, మార్చి3న పంపిన తన తండ్రి వీడియోను చూపించారు.అందులో గౌతమ్ తండ్రి.. తనకు మనవడు, మనవరాలిని చూడాలని ఉందని, వాళ్లని అర్జెంటుగా పంపాలని ఐసీయూలో ఉండి విజ్ఞప్తి చేసారు. ఆఖరి క్షణాల్లో తన తండ్రి వారసులను చూసుకోలేకపోయానని ఎంతో బాధపడ్డారని మీకు తెలుసా ? అని అంబటిని ప్రశ్నించారు. అంబటి వారి ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే దుర్మార్గులవుతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని నమ్మి, విసుగెత్తి కోర్టుకు వెళ్తే దుర్మార్గుడిగా ముద్రవేశారన్నారు. తన కొడుకు, కూతురిని పోషించనక్కర్లేదని, మీడియా సాక్షిగా నేనే తీసుకెళ్తానని తెలిపారు. నాన్నగా నన్ను వాళ్లకు దూరం చేసి.. ఎలాంటి తప్పు చేయలేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.