YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ వాయిస్ మారుతోందా...

 జగన్ వాయిస్ మారుతోందా...

విశాఖపట్టణం, మే 9
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ అధినేత.. ప్రస్తుతం ఏపీ సీఎం.. నిజానికి ఆయన క్యాంపెయిన్‌ స్టైల్‌ని అబ్జర్వ్‌ చూస్తే.. ఓ దూకుడు కనిపిస్తుంది. విపక్షాలపై విరుచుకుపడుతూ.. ఎవరేమన్నా డోంట్‌ కేర్ అన్నట్టుగా ఉంటుంది ఆయన మాట. బట్ ఆయన ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆయన స్టైల్‌కు భిన్నంగా కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకిలా అనాల్సి వస్తుంది? దీనికి ఎక్స్‌ప్లనేషన్‌ కంటే.. మీ చేవులారా మీరే వినండి.. నన్ను పదవిలో ఉండకుండా చేయాలని చూస్తున్నారు. కావాలనే కుట్రలు చేసి పథకాలు ఆపేస్తున్నారు.వీటన్నికంటే హైలేట్ డైలాగ్ ఏంటంటే.. ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదు. సీఎం జగన్ నోటి నుంచి ఈ మాటను ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే వైనాట్ 175 అంటూ క్లీన్ స్వీప్‌ చేయాలనుకున్నారు సీఎం జగన్.. అలాంటి ఆయన నోటి నుంచి ఎన్నికల విధానంపై ఎందుకు డౌట్స్ వస్తున్నాయి? ఈ మధ్య కాలంలో ఏమైనా మారిందా? లేదా అంచనాలు ఏమైనా తలకిందులయ్యాయా? లేదంటే కూటమిలో భాగమైన బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం.. టీడీపీకి ఫేవర్‌గా పనిచేస్తుందని ఫీలవుతున్నారా? అందుకే ఇలాంటి డైలాగ్‌ను వాడారా? వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ.. జగన్.. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఫలితాలు ఎలా వచ్చినా జూన్‌ 4 వరకు ఆయనే సీఎం.. అలాంటి వ్యక్తి నోటి నుంచి ఎన్నికల విధానంపై డౌట్స్ రావడం అస్సలు నార్మల్ కాదు. ఇది సింపతి కోసం జగన్ చేస్తున్న పొలిటికల్ స్టంటా? లేక మరేదైనా కారణమా? అయితే జగన్ ఇలా మాట్లాడటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్ధాం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పేరుకు నేతలు పదవుల్లో ఉన్నా.. అధికారం మొత్తం ఎన్నికల కమిషన్‌దే.. అలాంటి ఈసీకి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు అధికారం ఉంది. ఇప్పుడా అధికారాన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉపయోగిస్తుంది ఏపీలో.. లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నిధులను విడుదల చేయవద్దంది. దీంతో చేయూత, విద్యాదీవేన, రైతు భరోసా పథకాలకు నిధులు ఆగిపోయాయి.నిజానికి ఎన్నికలకు ముందే సీఎం జగన్ వీటికి సంబంధించి బటన్ నొక్కేశారు. కానీ ఈసీ ఇప్పుడు బ్రేక్ వేసింది. నెక్ట్స్‌.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని బదిలీ చేసింది. ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించకూడదని ఆదేశించింది. అంతకుముందు అనేక మంది ఎస్పీలు, డీఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది ఈసీ.. అంతేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై వేటు వేసింది. అధికార దుర్వినియోగం కాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. మొత్తానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నారనుకున్న అందరిపై వేటు పడింది..ఈ బదిలీలు.. ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే.. జగన్‌ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయన్నది అర్థమైంది అనే అనుకుంటున్నా.. అంతేకాదు జగన్‌ మాట తీరు మారడంతో ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారందరిపై వరుసగా వేటు పడుతూ వస్తుంది. దీంతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుందా? ఏదైనా జరగరానిది జరగుతుందని భయపడుతున్నారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.అయితే ఈ సిట్యూవేషన్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు జగన్.. అధికారులపై టీడీపీ నేతలు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. అందుకే ఈసీ చర్యలు తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ టీడీపీకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆన్‌ గోయింగ్ పథకాలను ఆపేస్తుంది టీడీపీ పార్టీనే. లబ్ధిదారులకు డబ్బులు అందకుండా టీడీపీ చేస్తోంది. అంటూ ఆరోపణలు చేస్తున్నారు జగన్.. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఆరోపణలు ఎన్ని చేసినా.. ఈసీ డెసిషన్ ఫైనల్.. అందులో ఎలాంటి మార్పు లేదు. ఉండదు కూడా.. ఇప్పుడు కోర్టులో పిటిషన్లతో రాజకీయ ప్రయోజనాలు తప్ప.. మరేం ఉండదు. బట్ అటు టీడీపీ, వైసీపీ మధ్య ఈ అంశంపై డైలాగ్‌ వార్‌ కంటిన్యూ అవడం పక్కా.. ఇందులో ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారు అన్నదే ఇప్పుడు పార్టీల తలరాతలను డిసైడ్ చేస్తుంది.

Related Posts