నెల్లూరు
నెల్లూరులో వైసీపీ ఎంపీ అభ్యర్థి.. రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. -- నగరంలోని 39, 46,49 డివిజన్ లలో బీ ఎల్ ఓ లు అక్రమాలు...శివ కుమార్ ను మాత్రమే సస్పెండ్ చేశారు . కూటమి.. కేంద్రం కలిసి రాష్ట్రం లో అధికారులను మార్చుతున్నారు. రాష్ట్రం లో ఏ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో సమాచారం ఉంది. రానున్న ప్రభుత్వం తప్పకుండ చర్యలు తీసుకుంటుంది . నెల్లూరు లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ లు రౌడీయిజం చేస్తున్నారు.. కొందరు పోలీస్ లు కొమ్ము కాస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీయిజం తమ ఇంటి వరకు ఉంచుకుంటే మంచిది. నెల్లూరు లో బీ ఎల్ ఓ ల నిబంధనల అతిక్రమణ పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ ఆయన రిటర్నింగ్ అధికారి సమ్మతమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. టటమికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే బిజేపికి ఎక్కడ కోపం వస్తుందో.. అని అధికారులు ఒకవైపే కొమ్ము కాస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.... ఎవరైనా నిష్పక్షపాతంగా పని చెయ్యాలి. రాబోయే ప్రభుత్వం తప్పక వారిపై చర్యలు తీసుకుంటుంది. కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకూ... మేం ఆధారాలతో సహా తీసుకుంటున్నాము. ఈ రోజు మేం చెబితే పట్టించుకోకపోవచ్చు....కానీ అధికారం లోకి వచ్ఛాక తప్పక యాక్షన్ వుంటుందని అన్నారు.