పులివెందుల
పులివెందుల నియోజకవర్గం లో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ ప్రచారంలో డాక్టర్ సునీతచపాల్గోన్నారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ఒక వైపు వైఎస్సార్ బిడ్డ..ఆ వైపు వివేకా హత్య నిందితుడు. అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీ గా ఉన్నారు. 10 ఏళ్లు ఎంసి గా ఉండి కడప స్టీల్ గురించి పట్టింపు లేదు. కడప స్టీల్ వైఎస్యసానర్ కల అని అన్నారు. ఎంపీ గా ఆన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు. వైజాగ్ స్టీల్ ఎట్లా నో..రాయలసీమ కి కడప స్టీల్ అంతా ప్రాధాన్యత ఉంది. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. డిల్లీకి సిబిఐ కోసం పోతున్నాడు. కడప ప్రజల కోసం ఒక్క నాడు పోలేదు. అవినాష్ రెడ్డి నిందితుడు అని మేము చెప్పలేదు. సీబీఐ ఆరోపణల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్.. మని లావాదేవీలు అన్ని ఆధారాలు ఉన్నాయి. వివేకా కి కొడుకులు లేరు. జగన్ ను కొడుకు లా చూశాడు. తండ్రి తర్వాత వివేకా తండ్రి అంతటి వాడు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డిని కర్నూల్ లో కాపాడాడు. ఇది అన్యాయం కాదా? జగన్ కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికే. రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. ఒకప్పుడు నేను ఆన్న కోసం పాదయాత్ర చేశా. ఇల్లు,వాకిలి,పిల్లలను వదిలి పెట్టీ 3200km పాదయాత్ర చేశా. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. ప్రపంచం మొత్తం చూస్తుంది. కడప లో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా ? న్యాయం వైపు నిలబడాలని కడప ప్రజలను కోరుతున్నానని అన్నారు.
డాక్టర్ సునీత మాట్లాడుతూ వివేకా ను దారుణంగా హత్య చేశారు. న్యాయంకోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు. ప్రజా తీర్పు చాలా పెద్దది. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీ గా పోటీ చేస్తుంది. న్యాయం వైపు షర్మిల నిలబడింది. అవినాష్ రెడ్డి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు. అవినాష్ రెడ్డి రేపో మాపో జైలుకి పోతాడు. ఇలాంటి వాడికి ఓటు వేయడం అవసరమా ? మనకు కడపలో ఉండే నాయకుడు కావాలి. జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదు. షర్మిల ను గెలిపించి వివేకా ఆత్మ కి శాంతి కలిగించండని అన్నారు.