నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీకి కాంగ్రెస్ పూర్తిగా ద్రోహం చేస్తే, ఎన్డీయే నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. వివక్షతోపాటు కుట్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని అణగదొక్కడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని బాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన నినదించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలుగు ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ రెండో తేదీని చంద్రబాబు చీకటి రోజుగా అభివర్ణించారు. మాకు తెలంగాణ ఆవిర్భవా దినోత్సవము, సమయం వాళ్లకు ఈ విషయము తెలువక పోవడం విచిత్రం, ఆ వార్త రాయరు కానీ ఆంధ్ర ప్రదేశ్ జూన్ 2తేదీ విద్రోహదినం ఈ వార్త మీకు గుర్తు ఉండడం గ్రేట్,పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి ప్రధాని ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీకి దిక్కు లేకపోతే పరిస్థితి ఏంటని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హామీల సాధన కోసం 29సార్లు ఢిల్లీ వెళ్లానని బాబు చెప్పారు.తొలినాళ్లలో రేపు మాపు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికారు. తర్వాత ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పారు. కానీ 11 రాష్ట్రాలకు జీవో కూడా లేకుండానే ప్రత్యేక హోదాకు సమానంగా వనరులు ఇచ్చారు, మనకు మాత్రం ఇవ్వలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే.. రూ.3,900 కోట్లు మాత్రమే ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ, పెన్షన్లను సాకుగా చూపారు’’ అని చంద్రబాబు చెప్పారు.పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని కరఖండీగా చెప్పాను. ఆర్డినెన్స్ తెచ్చాకే సీఎంగా బాధ్యతలు స్వీకరించాను. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ గురించి సమీక్షిస్తున్నాను. కేంద్రం ఇబ్బందులు పెట్టినా 55 శాతం పనులు పూర్తి చేశాం. మనం ఖర్చు చేసిన నిధులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరానికి నిధుల కేటాయించాల’’ని చంద్రబాబు డిమాండ్ చేశారు. రెండు నదులను అనుసంధానం చేశాం. తక్కువ సమయంలో నదులను అనుసంధానం చేసిన ఘనత తమదేనన్నారు. మన పొట్టగొట్టేలా విభజించారు. ఆదాయం, ఆస్తులు ఒక పక్క.. అప్పులు ఒక పక్క.. ఆస్తులు ఉన్న ప్రాంతానికే చెందెలా విభజించారు. విద్యుత్‌ను మాత్రం వినియోగం ఆధారంగా పంచారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో మన ప్రయాణం మొదలైంద’’ని బాబు తెలిపారు. మోదీ అమరావతి నిర్మాణం కోసం మట్టి, నీళ్లు తెచ్చారు. తర్వాత కూడా ఆయనలో మార్పు లేదు. వారికి గుజరాత్‌పై ఉన్న అభిమానం ఆంధ్ర ప్రదేశ్‌పై లేదు. డొలేరాపై ఉన్న అభిమానం ఆంధ్రప్రదేశ్‌పై లేదన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు అవతరణ దినోత్సవం జరుపుకొంటాయి. మనం మాత్రం జరుపుకోలేకపోతున్నాం. ఏమని జరుపుకోవాలి, ఏమిచ్చారని జరుపుకోవాలి? అందుకే దూరదృష్టితో ఆలోచించి నవ నిర్మాణ దీక్షను ప్రారంభించాను. ధైర్యంగా ముందుకెళ్దామని, సమష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చాను. కేంద్రంతో సఖ్యత కోసం ఎన్డీయేలో చేరాను. కానీ వారు నమ్మక ద్రోహం చేశార’ని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయి నేటికి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జూన్ రెండు నుంచి వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా నవ నిర్మాణ దీక్ష చేపడుతోంది. విజయవాడలోని బెంజి సర్కిల్ దగ్గర చేపట్టిన దీక్షలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలతో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను సంఘటితంగా ఎదుర్కొంటామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అందరికీ ఉపాధి కల్పించే రాష్ట్రాన్ని నిర్మించుకుందామని బాబు పిలుపునిచ్చారు.