YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి

ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ సింగపూర్‌లో పర్యటించారు. ఆదేశ ప్రధాని లీ సయన్ లూంగ్‌తో భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ అ దేశంలో ఉన్న విద్యాసంస్థలు, ప్రముఖ పర్యాటక స్థలాలు, పురాతన కట్టడాలను సందర్శించారు. దీనిలో భాగంగానే ఇండియన్ హెరిటేజ్ సెంటర్‌కు వెళ్లడంతో మోదీకి అక్కడున్న వాళ్లంతా సంతోషంతో ఘనస్వాగతం పలికారు. హెరిటేజ్ సెంటర్ నుంచి మధుబాణి పెయింటింగ్(మిథిల చిత్రకళ)ను రూపే కార్డును ఉపయోగించి ప్రధాని మోదీ కొనుగోలు చేశారు. దీంతో సెంటర్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తాజాగా అక్కడున్న సిబ్బంది బిల్లును చెల్లించడానికి రూపే కార్డును స్వైప్ చేస్తుండగా తీసిన ఫొటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. మరోవైపు భారత్‌కు చెందిన పురాతన వస్తువులను తిలకిస్తున్న ఫొటోలను షేర్ చేశారు. అంతకుముందు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మొబైల్ పేమెంట్ యాప్‌లు భిమ్, రూపే, ఎస్‌బీఐలను  సింగపూర్‌లో మోదీ ఆవిష్కరించారు. మధుబాణి / మిథిల చిత్రకళ అతి పురాతనమైన భారతీయ సంప్రదాయ చిత్రకళ. ఇది బీహర్ రాష్ట్రంలోని మిథిల ప్రాంతం, నేపాల్ ప్రాంతాలలో ఎక్కువ‌గా వేస్తారు. మిథిల నగరం అనే పేరు నుంచి మిథిల అనే పేరు సంగ్రహించారు.

Related Posts