YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభకు రాబర్ట్ వాద్రా

రాజ్యసభకు రాబర్ట్ వాద్రా

న్యూఢిల్లీ, మే 10,
అమేథీ సీటును కాంగ్రెస్ అధిష్టానం కేఎల్ శర్మకు కేటాయించిన తరువాత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని పేర్కొన్నారు. బహుశా రాజ్యసభ ఎంపీగా కావొచ్చంటూ ఆయన హింట్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నది సమాధానాలు చెప్పడానికి కాదని, దేశ ప్రజలకు సేవ చేయడానికి.. అది కూడా రాజ్యసభ ద్వారా కొవొచ్చు అంటూ ఆయన అన్నారు. ఖచ్చితంగా తాను త్వరలో పాలిటిక్స్ లోకి వస్తున్నానని.. దేశ ప్రజల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు.ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ మంగళసూత్రం గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఓ ప్రధాని మాట్లాడే మాటలు కాదు అవి అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చాలా కష్టపడుతున్నారన్నారు. తాను షో చేయడానికి పాలిటిక్స్ లోకి రావాలనుకోవడంలేదని.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయంలోకి వస్తున్నాని చెప్పారు.ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా దేశ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి.. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే అంశాలపైనే చర్చించుకుంటారని, వారి అడుగులు కూడా అటు వైపే ఉంటాయని ఆయన అన్నారు. అమేథీ ఎంపీ టికెట్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కేఎల్ శర్మకు కేటాయించారని చెప్పారు. తమ ఫ్యామీలో ఎలాంటి ఇష్యూస్ లేవని, తామంతా కూడా కలిసి దేశం కోసం పని చేస్తున్నామని అన్నారు.ఇదిలా ఉంటే, అమేథీ ఎంపీ స్థానానికి సంబంధించి టికెట్ విషయంలో చివరి వరకు సస్పెన్స్ నెలకొన్నది. చివరకు కేఎల్ శర్మకు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మొదటగా అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా బరిలో ఉంటారని, ఆయనకే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కేఎల్ శర్మకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ తరఫున కేఎల్ శర్మ బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. ఈ సీటులో ఎలాగైనా గెలవాలని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ కీలకంగా మారింది.

Related Posts