YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అత్యంత ప్రజాదరణ గల రైలుగా వందేభారత్‌ 103 గా ఓఆర్ రేషియో

అత్యంత ప్రజాదరణ గల రైలుగా వందేభారత్‌ 103 గా ఓఆర్ రేషియో

హైదరాబాద్, మే 10,
అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల అంటే తక్కువ దూరం, సుదూర, రిజర్వేషన్‌తో కూడిన, రిజర్వేషను లేని ప్రయాణాన్ని సరసమైన ఛార్జీలతో అందించేందుకు భారతీయ రైల్వే కట్టుబడి ఉంది.
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 102 వందేభారత్‌ రైళ్ళు నడుపబడుతున్నాయి.
మార్చి 31, 2024 నాటికి రెండు కోట్ల 15 లక్షల కన్నా ఎక్కువ మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వందేభారత్‌ రైళ్ళు అత్యంత ప్రజాదరణను పొందినవని చెప్పుకునేందుకు ఒక నిదర్శనం. 7వ మే, 2024 తేదీన వందేభారత్‌ రైళ్ళలో ప్రయాణించిన వారి సంఖ్య 98 శాతంగా నమోదయ్యింది. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7వ మే వరకు ఈ రైళ్ళ ఆక్యుపెన్సీ రేషియో 103 శాతంగా నమోదవగా .. 2022`23 మరియు 2023`24 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ఆక్యుపెన్సీ రేషియో 96 శాతంగా నమోదయ్యింది.
ఈ రైళ్ళలో అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణం గాలిలో తేలియాడుతున్న అనుభూతిని కలిగిస్తున్న కారణంగా ప్రజలు వీటిలో ప్రయాణానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అభివృద్ధికి, ఆధునికతకు, సుస్థిరతకు మరియు స్వావలంబనకు చిహ్నంగా మారుతున్నాయి.
వందేభారత్‌ ద్వారా దేశవ్యాప్తంగా 284 జిల్లాల అనుసంధానం:
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా దేశవ్యాప్తంగా 284 జిల్లాలు అనుసంధానించబడగా, ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెంపుదలను నమోదు చేసుకోగలదు. ప్రస్తుతానికి రైల్వే నెట్‌వర్క్‌లో 100 మార్గాల్లో మొత్తం 102 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు సేవలను అందిస్తున్నాయి.
ఒక్క సంవత్సరంలో భూమి చుట్టుకొలతను 310 సార్లు చుట్టివచ్చిన వందేభారత్‌ రైళ్ళు:
2023`24 ఆర్థిక సంవత్సరంలో వందేభారత్‌ రైళ్ళు భూమి చుట్టుకొలతను సుమారుగా 310 సార్లు చుట్టి వచ్చినంతటి దూరాన్ని ప్రయాణించాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రయాణికుల నుండి వస్తున్న ఆదరణ దృష్ట్యా త్వరలోనే స్లీపర్‌ రైళ్ళను కూడా ప్రవేశపెట్టే దిశగా అత్యంత వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న అంశాలు:
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలోని అన్ని బోగీలు ఆటోమేటిక్‌ డోర్లు, జిపిఎస్‌ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, వై`ఫై సేవలు మరియు అత్యంత సౌకర్యవంతమైన సీట్లతో నిర్మించబడ్డాయి. ఇక, ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లలో 180 డిగ్రీలు తిరుగగల స్వివెల్‌ సీట్ల అదనపు సౌకర్యం గలదు. ప్రయాణికులకు వేడి వేడి ఆహార పదార్థాలను, శీతల పానీయాలను అందించేందుకుగాను అన్ని బోగీలలో ప్యాంట్రీ సౌకర్యం ఏర్పాటు చేయబడడమే కాకుండా, వేగం, భద్రత మరియు సౌకర్యవంతమైన ప్రయాణం ఈ రైళ్ళకు చిరునామాగా నిలుస్తున్నాయి.
కర్బన ఉద్గారాలను మరింతగా తగ్గించేందుకుగాను ఈ రైళ్లలో శక్తి పునరుత్పాదక బ్రేకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయబడిరది. శబ్దరహిత బోగీలు ఈ రైళ్ళ యొక్క మరో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ రైళ్ళలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు వీలుగా బోగీల పైకప్పులో ఫోటో`క్యాటలిటిక్‌ అల్ట్రావయొలెట్‌ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ వ్యవస్థతో కూడిన ప్యాకేజీ యూనిట్‌ (ఆర్‌ఎంపియు) ఏర్పాటు చేయబడినది.

Related Posts