YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కపిల్ దేవ్ తో అమిత్ షా భేటీ

కపిల్ దేవ్ తో అమిత్ షా భేటీ
దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాల గురించి వివరించాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. 'సంపర్క్ ఫర్ సమర్ధన్' కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం దక్షిణ ఢిల్లీలోని లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నివాసానికి వెళ్లారు. గత నాలుగేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో రూపొందించిన పుస్తకాన్ని కపిల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా అందజేశారు. వారితో కాసేపు పలు అంశాలపై చర్చించారు.అంతకుముందు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్‌ల నివాసాలకు వెళ్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న 50 మంది మేధావులను కలిసి బుక్‌లెట్‌ను అందజేయనున్నారు. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ పుస్తకాన్ని వేలాది మందికి ఇవ్వనున్నారు.
ఉత్తర భారతాన్ని దుమ్ము తుపాను బెడద వదలడం లేదు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన దుమ్ము తుపాను కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మురాదాబాద్‌లో ఏడుగురు చనిపోగా.. ముజఫర్‌నగర్‌, మీరట్‌లలో ఇద్దరు చొప్పున ప్రాణాలు వదిలారు. సంభల్‌లో ముగ్గురు, బదౌన్‌లో ఇద్దరు మరణించారు. ఇళ్లు లేదా చెట్లు కూలిన కారణంగా ఈ మరణాలు సంభవించాయని రిలీఫ్ కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు. అమ్రోహలో చిన్న షెడ్ కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. 24 గంటల్లోగా ఆ ప్రాంత ప్రజలకు సాయం చేయాలని, బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని జిల్లా మెజిస్ట్రేట్‌లు ఆదేశించారు. మే 1 నుంచి ఏర్పడిన దుమ్ము తుపాన్లు, పిడుగుల కారణంగా ఒక్క యూపీలోనే దాదాపు 150 మంది చనిపోయారు. ఎక్కువ మంది చెట్లు, ఇళ్లు కూలడంతోనే ప్రాణాలు కోల్పోయారు. 

Related Posts