YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

 విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో నన్ను అంతమెందించే ప్రయత్నం చేశారు ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి రుషికొండను బోడిగుండు చేశారు సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం విశాఖ ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటా విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం
ఎప్పుడు నా గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం. నన్ను అభిమానించిన ప్రాంతం. 2019లో అందరూ సైకో జగన్ ను నమ్మి మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారు. కానీ విశాఖపట్నం ప్రజలు విజ్ఞతతో ఆలోచించి విశాఖపట్నంలోని నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. అది మీ ముందు చూపు. ‘జగన్ వస్తే రాజధాని బంధ్, పోలవరం ఆగిపోతుంది. చాలా కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలనుకుంటున్నారు. బజారుకి ఒక భూకబ్జాదారుడు తయరవుతాడు. ఊరికి ఒక రౌడీ తయారవుతాడు. జాగ్రత్తగా ఉండాలని’ నాడే చెప్పాను. నమస్కరించి చెప్పాను. విశాఖ ప్రజలు మాత్రం విన్నారు. మిగిలిన వారు జగన్ ను నమ్మారు. నేను చెప్పాల్సినంతగా చెప్పలేకపోయానేమో. ప్రజలను చైతన్యవంతులుగా చేయలేదేమో.
జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాదుడే, బాదుడు
జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాదుడే, బాదుడు. గుద్దుడే గుద్దుడు. ఒక్క కుటుంబానికి మంచి జరిగిందా అని అడుగుతున్నా? పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి.ఖర్చులు తగ్గాలి. జీవన ప్రమాణాలు పెరగాలి. శాంతిభధ్రతలు కాపాడి మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. జగన్ రెడ్డి ఇచ్చాడా అని అడుగుతున్నా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. వినూత్నంగా పరిపాలించాను. సోలార్, విండ్ ఎనర్జీలకు శ్రీకారం చుట్టాం. 2014 లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు లోటు ఉంటే మూడు నెలల్లో కరెంటు కోతలు అధికమించి నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. మిగులు కరెంటు సాధించాం. తెలుగుదేశం మరలా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. కాని నా మాట వినలేదు.సమర్థవంతమైన పాలన ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు యూనిట్ కరెంట్ ఉత్పత్తికి రూ.6 ఖర్చు అవుతుంటే.. ప్రస్తుతం రూ.2.50కి సోలార్ పవర్ లభిస్తోంది. అసమర్థ ముఖ్యమంత్రి పాలనతో కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారు. ఒకప్పుడు నాణ్యమైన మద్యం బ్రాండ్లు లభించేవి. వైసీపీ ప్రభుత్వం నాణ్యత లేని మద్యం విక్రయించం కారణంగా 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం ధరలు పెంచడంతో చాలా మంది విద్యార్థులు, యువత గంజాయికి అలవాటుపడ్డారు. విశాఖ ఐటీ క్యాపిటెల్గాం, నాలెడ్జ్ అకానమీగా, టూరిజం హబ్ గా తయారు చేయాలని సంకల్పించా. విశాఖలో ఐటెక్ సిటీకి సమానంగా మిలీనియం టవర్ నిర్మించి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ. డేటా సెంటర్ విశాఖకు వచ్చి ఉంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. అలాంటి విశాఖ నుంచి పరిశ్రమలు మొత్తం తరిమేసి ఈ ప్రాంత వాసులకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు. లూలూ పరిశ్రమ తరమేశారు.. లూలూ వచ్చి ఉంటే టూరిజం అభివృద్ధి చెందేది. విశాఖలో వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? విశాఖలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తోంది. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. చెత్త పన్ను, ఆస్తి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు, పేదల బతుకులు బారంగా మారాయి.
హుద్ హుద్ తుఫాన్ సమయంలో మీకు అండగా  ఉన్నా
జగన్ లాంటి అహంకారి, సైకో లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే బుల్రోజర్లతో వారి ఆస్తులను ధ్వంసం చేసే స్థితికి వచ్చారు. ఎంవీఎస్ మూర్తి గారు స్థాపించిన గీతం యూనివర్సిటీకి నేనూ కూడా పూర్తిగా సహకరించా. లాభాల కోసం నిర్మించిన సంస్థ కాదు గీతం..ఎన్జీవో ఆర్గనైజేషన్. దేశంలోనే అత్యున్నమైన యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ ఒకటి. అలాంటి గీతం యూనివర్సిటీని బుల్రోజర్లతో ప్రహరీ గోడలు పగలకొట్టే పరిస్థితికి వచ్చారంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ప్రజలు ఆలోచించుకోవాలి. విశాఖను హుద్హు్ద్ తుఫాన్ ముంచెత్తిన సమయంలో హుటాహుటినా వచ్చి సహాయ కార్యక్రమాలు చేశాం. తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.. నేను రాలేను అని తెలిసి కూడా బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చా. పది రోజుల పాటు విశాఖలోనే ఉండి తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజానీకానికి ఆదుకోని వారికి కొండంత ధైర్యం వచ్చిన తర్వాతనే హైదరాబాద్ వెళ్లా. హుద్ హుద్  తుఫాన్ ముందు విశాఖ.. హుద్హు్ద్ తుఫాన్ విశాఖ అభివృద్ధి అనే విధంగా కష్టపడి పనిచేశాం. విశాఖను స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో  సైతం తొమ్మిది సంవత్సరాలు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించా. హుద్ హుద్  తర్వాత మూడ్రోజులకు ప్రధాని మోదీ వస్తే.మీరు నాపై చూసిన అభిమానానికి ఆయన అశ్చర్యపోయారు. ఇంత విపత్తు జరిగినప్పటికీ.. మీపై వారికి ఉన్న నమ్మకం చూసి అభినందించారు. మీ అభిమానాన్ని నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశా. దీపావళి పండుగ వచ్చినప్పటికీ నష్టం వాటిళ్లుతుందని క్రాకర్స్ కాల్చవద్దని పిలుపునిచ్చిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. నా మాటకు విలువనిచ్చి ఒక్క టపాకాయ కూడా కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖ వాసులది. మీలో ఉన్న క్రమశిక్షణ, మంచితనాన్ని నా జీవితంలో ఎన్నడూ మరచిపోలేను. విశాఖ ఈస్టన్ డివిజన్ పవర్ కంపెనీ పరిధిలో బిల్లులు సక్రమంగా చెల్లించిన ఘనత ఈ ప్రాంతవాసులకే దక్కుతుంది. వందకు వంద శాతం ఈ ప్రాంత ప్రజలు కూటమికి వేయాలి.
కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఉద్యోగస్తులు ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి మరీ ఓట్లు వేశారు. దాదాపు 90 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైంది. ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించేవాళ్లం. రూ.16 వేల కోట్ల లోట్ బడ్జెట్‍ లో రాష్ట్రం ఉన్నప్పటికీ తెలంగాణతో సమానంగా 43 శాతం పి‍ట్మెంట్ ఇచ్చిన పార్టీ టీడీపీ. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పిట్మెంట్ ఇచ్చాం. వైసీపీ పాలనలో వారి డిమాండ్ల సాధాన కోసం ఉద్యోగస్తులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపలేని పరిస్థితి నెలకొంది. ఎవరైన ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ప్రశ్నించిన ఉద్యోగులను సస్పెండ్ చేయడమో, రిజర్వ్ లో పెట్టడమో లేక జీతాలు కూడా ఇవ్వకుండా వేధించే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంపై కసితో ఉద్యోగస్తులందరూ వన్సై డ్ గా పోస్టల్ బ్యాలెట్లో్ ఓట్లేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోస్టల్ బ్యాలెట్‍ లో 70 నుంచి 80 శాతం కూటమికే ఓట్లేశారు. కొన్నిచోట్ల వైసీపీ నాయకులు ఉద్యోగస్తులకు రూ.5 వేలు డబ్బులిస్తే.. వాటికి మరికొంత కలిసి కూటమి అభ్యర్థులకు ఇచ్చారంటే గెలుపు కూటమిదేనని.. గెలుపు ఎవరూ ఆపలేరని అర్థం చేసుకోవాలి.
రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు మా కోసం కాదు.. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రం నిలబడాలని, పతనమైపోయిన రాష్ట్రాన్ని పునర్‍ నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో కలిశాం. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకుని నగర బహిష్కరణ చేసిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ నాపై, పవన్ కల్యాణ్ పై  దాడి చేయించాడు. ఇన్ఛార్జ్ గా ఉంటేనే ఇంత రౌడీయిజం చేస్తే.. ఎమ్మెల్యే అయితే ఇలాంటి వారికి హద్దులుంటాయా? ఇలాంటి రౌడీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంచి వ్యక్తి అయిన విష్ణుకుమార్ రాజు రౌడీపై పోరాడుతున్నారు. ఈ పోరాటానికి ప్రజల అండ అవసరం.. విష్ణుకుమార్ రాజును గెలిపించాలి. ఎన్నికల సమయం దగ్గర పడింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరూ పవిత్రమైన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. మంచి వ్యక్తులను ఆశీర్వదిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. 2014లో జగన్ తల్లి విజయమ్మను ఓడించిన పంపిన ఘనత విశాఖ వాసులది.
నాడు కోడికత్తి డ్రామా , నేడు గులకరాయి డ్రామా
2019లో  బాబాయిని చంపి సానుభూతితో ఓట్లు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేరాలు చేసి, బాధితులపైనే కేసులు పెడుతున్నారు. సొంత చెల్లి చీరకట్టుపై జగన్ చేసిన వ్యాఖ్యలు అనైతికం. గతంలో కోడికత్తి డ్రామాను నేను హత్యాప్రయత్నం చేసినట్టు రక్తికట్టించారు. ఇప్పుడు మరోసారి గులకరాయి డ్రామా ఆడి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. జగన్ పర్యటనలో కరెంట్ లేకపోతే మాపై నెపం నెట్టాలని చూస్తారా? మీ పాలనలో ఇలా ఎందుకు జరుగుతోంది.బ్యాండేజీ తీయకపోతే గాయం పెద్దదవుతుందని చెల్లెలు చెబితే అప్పుడు తీశాడు నాటకాల రాయుడు. గులకరాయితో నేనే హత్యా ప్రయత్నం చేశానని చెప్పాడు. నా జీవితంలో ఎప్పుడూ హత్యలు చేయలేదు. నాది నేరచరిత్ర కాదు. ప్రజల కోసం ఏమైనా చేసే మనస్థత్వం నాది. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో హింసా, ముఠా రాజకీయాలను నేనే అణచివేశాను. రౌడీయిజం అణచివేశాను. మతసామరస్యాన్ని కాపాడటానికి కఠినంగా వ్యవహరించాను. తీవ్రవాద సమస్యపైన పోరాడాను. చివరకు నాపై 24 క్లెమోర్ మైన్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రజలకు శాంతిభద్రతలు ఉండాలని..నేను ఏమైనా పర్వాలేదని ప్రజల కోసం పోరాడిన వ్యక్తిని. మరలా అధికారంలోకి వస్తానే రాజకీయ రౌడియిజాన్ని తుంగలో తొక్కిస్తా. ఎవరిని వదిలిపెట్టను. జగన్ కు ఉన్నది విశాఖపట్నం ప్రజలపై కాదు. ప్రజల ఆస్తులపై ఆయనకు ప్రేమ. విశాఖలో వందలాది కబ్జాలు జరిగాయి. మెడమీద కత్తి పెట్టి రాసిస్తావా లేదా అని బెదిరించారు. ఆస్తి పోయిన ప్రాణం ఉంటే బలుసాకు తిని బ్రతకొచ్చని ప్రజలు వారి ఆస్తులను రాసిచ్చేశారు. ఇది న్యాయమా? 40 ఏళ్లు సంపాదించిన ఆస్తులు ప్రజలు పోగొట్టుకున్నారు.
రాజమండ్రి జైల్లో నన్ను అంతమెందించే ప్రయత్నం చేశారు
రాజమండ్రి జైల్లో నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా నేను భయపడలేదు. భగవంతుడు రాసిపెడితే ఏదైనా జరగుతాదని..తప్పుచేయలేదు..కాబట్టే ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. డ్రోన్ లు పంపారు. నన్ను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వ చర్యలను విమర్శించాడని ఆయనను అరెస్టు చేసి పోలీసు కస్టడీలో టార్చర్ పెట్టారు. రఘురామకృష్ణరాజును కొడుతుంటే జగన్ రెడ్డి వీడియోలు చూసి ఆనందపడ్డాడు. ఈ ఆనందాన్ని ఏమనాలి? మీ జీవితాల్లో ఎప్పుడైనా చూశారా? రఘురామకృష్ణం రాజుకు సీటు ఇచ్చే విషయంలో ఎంపీ సీటు ఇవ్వలేకపోతే..ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఆదుకున్నాం. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. విశాఖ వాసుల మంచితనం నాకు తెలుసు. రాష్ట్రంలో అరాచకాన్ని పూర్తిగా నివారించేందుకు ఇక్కడ మంచే శ్రీకారం చుట్టాలి. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారే. ఎవరికీ అనుమానాలు వద్దు. మన రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చి వ్యవస్థలను పతనం చేశారు. శాంతిభద్రతలు పతనమైపోయాయి. ఉద్యోగాలు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కేంద్రంలో మోదీ గ్యారెంటీలు ఉన్నాయి. రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఇచ్చాం. ఇవి కాకుండా ఎన్నికల ప్రణాళిక కూడా ఎంతో స్పష్టంగా ఇచ్చాం. దేశంలో కూడా దూసుకెళుతోంది. 2047 కల్లా వికసిత్ భారత్ కావాలని నరేంద్ర మోది లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని నేను, పవన్ కళ్యాణ్ లు లక్ష్యంగా పెట్టుకున్నాం. భారతదేశం నెంబర్ 1 గా ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్, తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనేదే మా ఆలోచన. పేదరికం లేని జీరో పావర్టీ రాష్ట్రంగా ఉండాలి. పేదల కోసం పనిచేస్తామని మీకు హామీ ఇస్తున్నా.
సూపర్ సిక్స్
సూపర్ సిక్స్ లో ఆడబిడ్డలందరికీ నెలకు రూ.1500 లు ఏడాదికి రూ.18 వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలు పెట్టాం. మహిళలను గౌరవించిన పార్టీ. ఇంట్లో ఇద్దరుంటే రూ.2.70 లక్షల ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇచ్చి వారిని చదివిచ్చే బాధ్యత మాది. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాం. ఎక్కడికైనా మహిళలు వెళ్లాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆడపడుచులను ఆదుకుంటాం. పట్టణాల్లోని ఆడబిడ్డలకు ఉపాధి కల్పించేందుకు మార్గాలను అన్వేషిస్తాం. 3 కోట్ల మందిని కోటీశ్వరులను చేయాలని కేంద్రం బడ్జెట్ పెట్టింది. అందులో 30 లక్షల మందిని మన రాష్ట్రం నుంచి కోటేశ్వరులను చేసుకుంటే 30 లక్షల కుటుంబాలు  బాగుపడతాయి. యువకులకు జాబ్ రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నా మొదటి సంతకం మెగా డీఎస్సీకే పెడుతా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సర్వీసు కమీషన్ ప్రక్షాళన చేసి మీ అందరికి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. సర్వీసు సెక్టార్ ను అభివృద్ధి చేస్తాం. ఇప్పటి వరకు కుల గనణ, మత గణనలు చేశారు. కూటమి ప్రభుత్వం వస్తానే స్కిల్ సెన్సెస్ తీస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టి తెలుగు తమ్ముళ్లు ప్రపంచంలో ఎక్కడా పనిచేసుకోవాలన్నా ఇక్కడ నుంచే పనిచేసుకునేలా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. వర్క్ ప్రం హోం తీసుకొస్తాం. ఐటీ టవర్లు కట్టి విశాఖ నుంచే అమెరికా, ఆస్ట్రిలియా కంపెనీల్లో పనిచేసుకునేలా చేస్తాం. యువకులకు మేలు చేసేందుకు ఎన్ని మార్గాలున్నాయో వాటన్నింటిని అన్వేషిస్తాం. 25 ఏళ్ల క్రింతం నేను ఐటీ గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు ఆ ఐటీనే యువకులను కోటీశ్వరులను చేస్తోంది. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ
పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ 1985 లో మొట్టమొదటి సారిగా రూ.35 లతో ప్రారంభించారు. దాన్ని 2019 కి రూ.2000 చేశాం. జగన్ రెడ్డి నోరిప్పితే అబద్దాలు. అబద్దాలను నిజం చేయడానికి పదే పదే చెబుతాడు. నేను సభల్లో అన్ని సమస్యలపై మాట్లాడుతుంటే..జగన్ రెడ్డి ఒకటే ఉపన్యాసం అన్ని సభల్లో మాట్లాడుతున్నాడు. ఇంతకంటే రికార్డు చేసి పంపితే సరిపోతుంది. నేను సవాల్ చేస్తున్నా. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. వంద సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు. నేడు విదేశీవిద్య, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా లు ఉన్నాయా? పేద పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తే వాటన్నింటిని రద్దు చేశాడు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? మన ఇంట్లో బామ్మను పెట్టి బటన్ ను నొక్కమంటే నొక్కుతూనే ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి, రోడ్లు వేయడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, కరెంటు కోతలు లేకుండా చేయడానికి, శాంతిభద్రతలు అదుపు చేయడానికి ముఖ్యమంత్రి కావాలి.
మాట్లాడితే బటన్ నొక్కుతున్నానని చెబుతున్నాడు.
రుషికొండను బోడిగుండు చేశారు
రుషికొండ బోడిగుండు అయ్యిందా లేదా? విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన జగన్ రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పాండ్, బెంగుళూరు, కడప, విజయవాడ తాడేపల్లిలలో ప్యాలెస్ లు కట్టుకున్నాడు. చివరకు విశాఖపట్నంలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండపై ప్యాలెస్ కట్టాడు. మీరు ఆ ప్యాలెస్ ను చూశారా? మిమల్ని ఆ ప్యాలెస్ లోకి రానిచ్చారా? నేను, వపన్ కళ్యాణ్ లు వస్తే మమల్ని పోకూడదని అడ్డుకున్నారు. వీళ్ల అబ్బసొమ్మా విశాఖపట్నం. జగన్ రెడ్డికి విపరీతమైన అహంకారం. రుషికొండపై కట్టింది టూరిజం గెస్ట్ హౌస్ అని చెబుతున్నాడు. రూ.500 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ ఎవరైనా కడతారా? అక్కడ ఎవరికైనా రూమ్ లు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. కోట్లు ఖర్చు పెట్టి ఆ రూముల్లో ఎవరుంటారు? మీరు ధైర్యంగా ముందుకు రండి. జగన్ రెడ్డి పనైపోయింది. సైకిల్, కమలం, గ్లాసులను మీరు గెలిపించాలి. మాములుగా గెలిపించడం కాదు..మన గెలుపు చూసి జగన్ రెడ్డి దిమ్మతిరిగి గూబ గుయ్యిమనాలి. అనకొండలు మాదిరి కొండలనే కరిగించేశారు. స్కూళ్లకు రంగులు కొడితే చదువు వస్తుందా? టీచర్లను నియమించాడా? ఇంగ్లీషు నేర్పిస్తున్నానని చెబుతున్నాడు. ఇంగ్లీషు ఎవరికి తెలియదు.
ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి
రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేశారు. స్థానికంగా ఉండేవారికి ఇక్కడ మైనింగ్ పై పెత్తనం ఉందా? ఇసుక దోచేశారు. ఇక్కడ విజయసాయి రెడ్డి పెత్తనం ఏంటి. విజయసాయి రెడ్డి ట్రాన్స్ ఫర్ అయ్యి సుబ్బారెడ్డి వచ్చాడు. అంటే మీరు తప్ప ఉత్తరాంధ్రలో ఎవరు లేరా? ఉత్తరాంధ్ర ప్రజల పెత్తనం ఉండాలి కానీ, వైకాపా నాయకులు పెత్తనం ఏంటి? కేవలం విశాఖలోనే రూ.40 కోట్ల ఆస్తులను కబ్జా చేసిన సైకో గ్యాంగే సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు. వీటిన్నింటిపై చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తులను కాపాడుతామని హామీ ఇస్తున్నా. పేదలకు రూ.4 వేలు పించన్ ఇంటి వద్దకే తెచ్చిస్తాం. ఏప్రిల్ నుంచే ఇచ్చి బకాయిలతో కలిపి రూ.7 వేలు ఇస్తాం. సైకో జగన్ ఎంత ఇస్తానన్నాడో మీకు చెప్పాడా? 2028 లో రూ.250 పెంచుతానని చెబుతున్నాడు. ఈయన రూ.250 కోసం వృద్దులు అప్పటి వరకు బ్రతికుండాలా? అందుకే శవరాజకీయాలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి పేదల ప్రతినిధి కాదు. పేదల కోసం పనిచేసి సంపద సృష్టించి పేదలకు పంచుతాం. చేపలు ఇవ్వడమే కాకుండా ఆ చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పుతాం. మీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపుతాం. 296 జీవో ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తాం. విశాఖలో టిడ్కో ఇళ్లు కడితే రంగుల పిచ్చోళ్లు ఇళ్లకు రంగులు వేసుకున్నారు గాని వాటిని మీకివ్వలేదు. మీరుండే ఇళ్లకు పట్టా ఇస్తే అవినీతికి పాల్పడుతారని పసుపు-కుంకుమ ద్వారా డైరెక్ట్ గా మీ చేతికే పట్టా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం.
అమరావతిని విధ్వంసం చేసి రూ. 4 లక్షల కోట్ల ప్రభుత్వ సంపదను నాశనం చేశారు. తెలుగుదేశం పోలవరాన్ని 72 శాతం పూర్తి చేస్తే..దాన్ని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతికి మనం టెండర్లు పిలిస్తే..దాన్ని నాశనం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. విశాఖపట్నంకు నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం. జగన్ రెడ్డి కారణంగా 28 శాతం నిరుద్యోగం పెరిగింది.
పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి?
మీ ఆస్టి మీ పేరున ఉండాలి. కానీ, ఈ భూమి పత్రాలపై జగన్ బొమ్మ ఏంటి. మీ భూమి పత్రాలపై ఆయన బొమ్మ వేసుకుంటే మీకు కోపం రావడం లేదా? ఎప్పుడైనా ఇలాంటి పత్రాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. రాజముద్రను తీసివేసి జగన్ రెడ్డి తన బొమ్మ వేసుకున్నాడంటే ఎంత అహంకారమో ఆలోచించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ప్రభుత్వ రాజముద్రతో మీ భూమి పత్రాలు మీకిస్తా. జగన్ రెడ్డి ఇచ్చిన ఈ చిత్తు కాగితాలను చింపి చెత్తబుట్టలో వేద్దాం. ఈ విషయాన్ని ప్రతీ ఇంటికి మీరే చేర్చాలి. మన భూములను సైకో కొట్టేయాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డి కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదు..జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. ఈ చట్టం ద్వారా మీ భూమికి జిరాక్సు కాపీలు మీకిచ్చి ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. బ్యాంకులకు జిరాక్సు కాపీలు ఇస్తే ఒప్పుకుంటాయా? అమ్ముకోవడానికి, రుణాలు తెచ్చుకోవడానికి మీకు వీలుంటుందా? మీ భూమి పత్రాలకు అమెరికాలో ఒక ప్రైవేటు వ్యక్తిని ఓనర్ గా పెడుతాడంట. మీ భూములను మీరు అమ్ముకోవాలంటే జలగ జగన్ పర్మీషన్ అవసరం. ఇక్కడ ఆయన గుమస్తా..సజ్జలను పెట్టుకుంటాడు. మీరు అమ్ముకోవాలంటే ఆ గుమస్తా పర్మీషన్ కావాలి. మీ భూములపై వేరే వారికి పెత్తనం ఇస్తుంటే అది సమంజసమేనా అని అడుగుతున్నా? మీ భూములకు శాశ్వత పత్రాలు ఉంటేనే వాటిని తారుమారు చేస్తున్నారు. ఇప్పుడు మీ భూములకు చెందిన ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉంటే మీ భూముల పరిస్థితి ఏమిటీ? అందుకే కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తాను.
జగన్ రెడ్డి మీకందరికి ఉరివేయాలని చూశాడు. మీరందరు కలిసి మే13 తేదీన జగన్ రెడ్డికి ఉరివేయాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నా భూమిపై ఒక సైకో ఫోటో వేసుకోవాలా? జగన్ రెడ్డికి ఎంత ధైర్యం. అందుకే ప్రమాదాన్ని గుర్తించండి.
రౌడీయిజాన్ని అణిచివేస్తా
విశాఖపట్నంలో శాంతిభద్రతలు కాపాడటం నా మొట్టమొదటి ప్రాధాన్యత. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం. ఎవరైనా మీపైకి, మీ ఆస్తులపైకి వస్తే..వారికి అదే చివరి రోజు. గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. గంజాయి గ్యాంగులకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. విశాఖలో 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. నాలెడ్జ్ ఎకానమిని అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టు ప్రారంభిస్తే.. జగన్ రెడ్డి మరలా శంకుస్థాపన చేశాడు. మనం వచ్చి ఉంటే..2020 పూర్తయ్యేది. విశాఖకు మెట్రో వస్తుందనే నమ్మకం మీకు ఉందా? హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తే.. అది నత్తనడకన ఇప్పుడు పూర్తయ్యింది. విశాఖపట్నంకు టెండర్లు ఇచ్చే సమయంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని నాశనం చేశాడు. విశాఖపట్నంకు మెట్రో రైల్ తీసుకొచ్చే భాధ్యత మాది. విశాఖ రైల్వే జోన్ కు పనికిమాలిన భూమి ఇచ్చి తిరిగి ప్రధానిపై ఎదురు దాడి చేస్తున్నాడు. బొత్స నీ స్థాయి ఎంత?  ప్రధానిపై మాట్లాడుతావా? బొత్సకు బొచ్చు ఊడిపోతుంది. నీ తమ్ముళ్లు ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఈయన మంత్రి, మరలా ఇక్కడ తన సతీమణిని తీసుకొచ్చారు. అంటే ఉత్తరాంధ్రపైన మీ కుటుంబ పెత్తనం ఏంటీ? సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు ఈ ప్రాంతాన్ని దోచేస్తే..కమీషన్ కోసం ఒక్క మాట మాట్లాడలేదు.
విశాఖ నార్త్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఎన్ఎస్టీాఎల్ వరకు 60 అడుగుల రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తాం. కొండ ప్రాంత వాసుల రక్షణ కోసం రక్షణగోడ నిర్మాణాలు పూర్తిచేస్తాం. విశాఖ ఈస్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి మురుగు సమస్యలు లేకుండా చేస్తాం. హుద్హు్ద్ సమయంలో నిర్మించతలపెట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. విశాఖలో ఇంటి పట్టాలు లేని వారందరికీ ఇళ్ల పట్టాలిస్తాం. విశాఖ సౌత్‍ లో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. పోర్టు నుంచి వచ్చే కాలుష్యానికి నివారణ చర్యలు చేపడతాం. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసి విశాఖను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతాం. విశాఖలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, రోడ్లను ఆధునీకరిస్తాం. పరిశ్రమల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాం. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు పెంపొందిస్తాం. విశాఖపైన నా ప్రేమ శాశ్వతం.. ఇప్పుడే కాదు ఎప్పటికీ విశాఖ వాసులపైన నాకు ప్రేమ ఉంటుంది. విశాఖను మోస్ట్ బ్యూటీఫుల్ సిటీగా, మోస్ట్ లీవ్‍ బుల్ సిటీగా తీర్చిదిద్దుతాం. విశాఖను ఆదర్శవంతమైన నగరంగా తయారు చేసే బాధ్యత నాది. రూ.500 కోట్ల ప్రజా సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్న దొంగను ఇక్కడకు రానిస్తే మీ ఆస్తులు, మీ భూములకు రక్షణే లేకుండా పోతుంది. మీరందరూ దేశంలో ఎక్కడా వెయ్యని విధంగా 13వ తారీఖున 95 శాతం పోలింగ్ నమోదు చేసి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని, తద్వారా బాధ్యత కలిగిన పౌరుడిగా.. ప్రజా ప్రతినిధులకు కూడా బాధ్యత నేర్పిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఓటు మీ జీవితాలను బాగు చేస్తుంది.. సమాజహితం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. సమైక్యాంధ్రలో నాకు వచ్చిన అవకాశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నా వల్ల హైదరాబాద్ బాగుపడిందని నా మనస్సులో ఎప్పటికీ తృప్తి ఉంటుంది. చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పెట్టి హింసించారు. నేను జైల్లో ఉన్నప్పుడు 83 దేశాల్లో నా కోసం పోరాడారంటే, రాష్ట్రమంతా పోరాడంటే.. దానికంటే ఒక నాయకుడిగా నేను ఏమి కోరుకోగలను. 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఓటేస్తామని, తద్వారా మార్పుకు నాంది పలుకుతామని హర్షాన్ని, ఆమోదాన్ని, సంకల్పాన్ని తెలియజేయాలి. అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రతిఒక్కరితో ఓటు వేయించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో విష్ణుకుమార్ రాజును గెలిపించాలి. సమర్థుడు, సమయస్ఫూర్తి కలిగిన నాయకుడు విష్ణుకుమార్ రాజు. విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ గత ఎన్నికల్లోనే ఎంపీ అవ్వాల్సింది.. కొద్దిపాటి ఓట్లతో మిస్సయ్యాడు. ఈసారి మాత్రం భరత్ అతిపెద్ద మెజార్టీతో గెలవాలి. విశాఖ గళాన్ని పార్లమెంట్లోా భరత్ వినిపించాలని అన్నారు.

Related Posts