YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఖమ్మం
బీఆర్ఎస్  అభ్యర్ధి నామా నాగేశ్వర రావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరం త్రీ టౌన్ పరిధిలోని డివిజన్ లు,  ఒన్ టౌన్ పరిధిలోని డివిజన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ ను సాధించారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిందన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అన్ని సంక్షేమ పథకాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, అసలు వారికి ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. అధికారంలో వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా నేటి వరకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదన్నారు. రూ.500 కే గ్యాస్ అన్నారు.. అయ్యిందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలకే దిక్కులేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అనేక మర్లు చెప్పా.. మీకు ఇష్టమైన సీరియల్ చూడాలంటే కరెంట్ రెప్పపాటున పోదు.. కానీ కాంగ్రెస్ వచ్చాకా మహిళలు ఇంట్లో చూడగలుగుతున్నారా చెప్పాలన్నారు.  నగరంలో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళ క్రింద నగరంలో వాటర్ ట్యాంకర్ లు గల గల తిరిగేవి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి త్రాగునీటి పై ప్రత్యేక ప్రణాళిక చేశామని చెప్పారు.గడచిన తొమ్మిది ఎండాకాలం లలో ఒక్క వేసవి లో కూడా త్రాగునీటి కొరత రాకుండా చూశామని, ఎన్నడూ వాటర్ ట్యాంకర్ లు నగరంలో సంచరించేవి కాదన్నారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఐదు నెలక్కునే త్రాగునీటి కి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మళ్ళీ ప్రతి రోజూ వాటర్ ట్యాంకర్ లు గల గల తిరుగుతా ఉన్నాయని వివరించారు. ఖమ్మం లో పారిశుద్యంలో నెంబర్ వన్, త్రాగునీటి పంపిణీలో నెంబర్ వన్, రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణంలో నెంబర్ వన్ ఇలా అనేక కార్యక్రమాల్లో ముందంజలో నిలిపిన అని అన్నారు.ఇదే త్రీ టౌన్ ప్రాంతంలో మురికి కూపంగా ఉన్న గొళ్లపాడు ఛానల్ ను రూ.70 కోట్ల తో అభివృద్ధి చేస్తే.. దానికి రూ.170 కోట్లు అని అసెంబ్లీ ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసి ప్రజల్లో తప్పుడు సమాచారం పంపారు అని అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేయలపోతుంది..? ఇది మీ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజల పై ప్రేమ ఉంటే ఇలానే చేస్తారా.. ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లు వేసింది.. ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా ఇచ్చే దుస్థితి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని మరచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పంచ ఊడదీస్తా, లుంగీలో తొండలు వదులుతా, గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా అనే అనడం మీ స్థాయిని చెప్తుంది అన్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్నపుడు హుందాతనంగా ఉండాలి కానీ చిల్లర మాటలు మాట్లాడటంతో మీ మనస్తత్వం అర్దం అవుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు నెరవేరాలంటే బీఆర్ఎస్  అభ్యర్ధి నామా నాగేశ్వర రావు ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts